Page Loader
Maharashtra: మద్యం మత్తులో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కొడుకు భీభత్సం.. పలు వాహనాలను ఢీకొట్టి పరార్!
మద్యం మత్తులో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రోడ్లపై భీభత్సం.. పలు వాహనాలను ఢీకొట్టి పరార్!

Maharashtra: మద్యం మత్తులో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కొడుకు భీభత్సం.. పలు వాహనాలను ఢీకొట్టి పరార్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2024
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే కుమారుడు సంకేత్ బవాన్‌కులే మద్యం మత్తులో రోడ్లపై బీభత్సం సృష్టించాడు. సోమవారం అర్ధరాత్రి నాగ్‌పూర్‌లో పలు వాహనాలను ఢీకొట్టి, పరార్ అయ్యాడు. ఈ ఘటనలో కారులోని మరో ఇద్దరు వ్యక్తులు, అర్జున్ హవ్రే, రోనిత్ చిట్టమ్‌వార్‌ను పోలీసులు అరెస్టు అయ్యారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో మద్యం మత్తులో ఉన్న సంకేత్ తన ఆడి కారుతో మాన్కాపూర్ వైపు వెళుతూ ఇతర వాహనాలను ఢీకొట్టాడు. వాహనదారులు కోపంతో అతని కారును వెంబడించగా, సంకేత్ తన కారును మార్గమధ్యంలో వదిలేసి పరారయ్యాడు.

Details

చట్టం ముందు అందరూ సమానులే : చంద్రశేఖర్

ఈ ప్రమాదంలో తన కారుకు నష్టం జరిగిందని బాధితుడు జితేంద్ర సోన్‌కాంబ్లే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా కారులో ఉన్న డ్రైవర్ అర్జున్ హవ్రే, రోనిత్ చిట్టమ్‌వార్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు, వెంటనే వారిని బెయిల్‌పై విడుదల చేశారు. ఈ ఘటనపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే స్పందించారు. ఆడి కారు తన కుమారుడి పేరిట రిజిస్టర్ అయిందని చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, దోషులకు శిక్షించాలని, చట్టం ముందు అందరూ సమానమే అని బవాన్‌కులే చెప్పారు.