Page Loader
తలలు తెగే చోటుకు పెట్టుబడులు ఎలా వస్తాయ్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు 
తలలు తెగే చోటుకు పెట్టుబడులు ఎలా వస్తాయ్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు

తలలు తెగే చోటుకు పెట్టుబడులు ఎలా వస్తాయ్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు 

వ్రాసిన వారు Stalin
Oct 02, 2023
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది చివర్‌లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు. మోదీ సోమవారం రాజస్థాన్‌లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఏడాది జూన్‌లో ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్ కన్హయ్య లాల్‌ను హత్య చేసిన ఉదంతంపై రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని మోదీ టార్గెట్ చేశారు. ఉదయ్‌పూర్‌లో ఏం జరిగిందో ఎవరూ ఊహించలేదన్నారు. బట్టలు కుట్టించుకుంటామనే నెపంతో జనం వచ్చి దర్జీల గొంతులు కోసి హంతకులు భయ లేకుండా తీరుగుతున్నారన్నారు. కన్హయ్య లాల్‌ హత్యను కాంగ్రెస్ ఓటు బ్యాంకును రాజకీయాలకు వాడుకుందన్నారు.

మోదీ

నేరస్థుల పట్ల ఉదాసీతతో వ్యవహస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మోదీ

రాష్ట్రంలో ఇక్కడ తలలు నరికే ఘటనలు జరుగుతుంటే, పెట్టుబడులు ఎలా వస్తాయని మోదీ అన్నారు. రాజస్థాన్‌లో శాంతిభద్రతలపై కూడా గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నేరస్థుల పట్ల ప్రేమగా వ్వవహరిస్తోందన్నారు. వారిపై చర్యలు తీసుకోకుండా, నేరస్థులకు స్వేచ్ఛ ఇస్తోందన్నారు. గతేడాది జూన్ 28న ఉదయ్‌పూర్‌లోని తన దుకాణంలో కన్హయ్య లాల్ పని చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి అతడిని నరికి చంపి అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ ఘటన మొత్తం వైరల్‌గా మారింది. ఈ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్హయ్య లాల్‌ హత్యకేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై 11 మందిపై నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) చార్జిషీట్‌ దాఖలు చేసింది.