Noida: నోయిడా యువతి మృతి కేసులో IRS అధికారి అరెస్ట్
నోయిడాలో ఓ యువతి మృతికేసులో IRS అధికారి సురభ్ మీనాను స్ధానిక పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి మీనాయే బాధ్యుడిగా పేర్కొన్నారు. మీనా,శిల్పా గౌతమ్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దీనిపై మీనాను వివాహం చేసుకోవాలని శిల్పా వత్తిడి పెంచింది. దీనికి ఆయన కాదన్నాడని మృతురాలి తల్లి తండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మీనా , శిల్పా గౌతమ్ తరచుగా గొడవ పడే వారని తెలుస్తోంది. సురభ్ తమ కుమార్తె పై పలు మార్లు చేయి చేసుకున్నాడని శిల్పా తల్లి తండ్రులు ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఇక తమకు వివాహం కాదని భావించింది . దీంతో ఆమె ఇక్కడి సెక్టార్ 100 లోటస్ బుల్వేరాడ్ అపార్ట్ మెంట్ లో ఆత్మహత్యకు పాల్పడింది.
ఆత్మహత్య జరిగినపుడు సురభ్ మీనా అక్కడే
ఈ ఘటన జరిగినపుడు సురభ్ మీనా అక్కడే ఉన్నాడు .ఈ దుర్ఘటన మే 25 న జరిగింది. ఈ మేరకు తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. కాగా మృతురాలు శిల్పా గౌతమ్ (BHEL) లో డిప్యూటీ మేనేజర్ గా పని చేస్తున్నారు. సురభ్ మీనా ఆదాయపు పన్నుల విభాగంలో కమిషనర్ గా పని చేసిన సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీనిని మృతురాలి తల్లి తండ్రులు ధృవీకరించారు. వీరిద్దరూ మూడేళ్లు సహజీవనం చేశారని తెలిపారు. తమ కుమార్తె మృతికి మీనాయే కారణమని వారు ఆరోపించారు.