LOADING...
#NewsBytesExplainer: కేసీఆర్‌ బొమ్మ లేకుండానే కవిత తెలంగాణ జనయాత్ర.. సోలో ఫైట్ కు సిద్ధమయ్యారా?
కేసీఆర్‌ బొమ్మ లేకుండానే కవిత తెలంగాణ జనయాత్ర.. సోలో ఫైట్ కు సిద్ధమయ్యారా?

#NewsBytesExplainer: కేసీఆర్‌ బొమ్మ లేకుండానే కవిత తెలంగాణ జనయాత్ర.. సోలో ఫైట్ కు సిద్ధమయ్యారా?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2025
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పుడు సొంత రాజకీయ యాత్రలో "సోలో ఫైట్" కు సిద్ధమవుతున్నారట. ఆమె తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఉపయోగించకూడదని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కవిత కార్యక్రమాల్లో తరచుగా తన తండ్రి కేసీఆర్ ఫోటోని ప్రదర్శించేది, కానీ ఇప్పుడు తన జన యాత్రలో అది కనిపించకపోవడం ప్రజలకు,రాజకీయ విశ్లేషకులలో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇంతకుముందు,కవిత బీఆర్‌ఎస్‌లోని ఇతర నేతలతో సంబంధాలు ఎలా ఉన్నా, కేసీఆర్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. కేసీఆర్ బీఎస్ఆర్ కు ఒక "కన్ను"అయితే, తెలంగాణ జాగృతి మరో "కన్ను" అని ఆమె తరచుగా చెప్పేవారు.

వివరాలు 

త్వరలో తెలంగాణ జనయాత్ర 

కానీ ఈ సారి, టోన్ మారిపోయినట్టు తెలుస్తోంది. కవిత ఫస్ట్ టైమ్‌ కేసీఆర్ ఫోటో లేకుండా పెద్ద కార్య‌క్ర‌మాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పార్టీకి రాజీనామా చేశాక నిర్వహించిన రకరకాల కార్యక్రమాల్లో సైతం, ప్రొఫెసర్ జయశంకర్‌తో పాటు కేసీఆర్ ఫోటోలు జాగృతి ఫ్లెక్సీల్లో ఉండేవి. కానీ ఈ సారి ఒక ఫోటో మిస్ అవ్వడం "హాట్ టాపిక్" అయింది. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరగబోయే తెలంగాణ జనయాత్ర కవితకు జాగృతి తరఫున నిర్వహించే అత్యంత పెద్ద ప్రోగ్రామ్. ఇప్పటికే పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. గతంలో "తండ్రి కేసీఆర్ జాగృతి రెండో కన్ను"అని పేర్కొన్న కవిత,ఇప్పుడు పోస్టర్‌లో ఆయన బొమ్మ లేకుండా చేయడం ఏంటని క్వశ్చన్‌ మార్క్‌ పేసులు పెడుతున్నారు చాలామంది.

వివరాలు 

కవిత పార్టీ పెడతారన్నప్రచారం 

అయితే.. ఈ విషయమై కాస్త లోతుగా ఆలోచిస్తున్న వాళ్ళు మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ చాలానే ఉందని అంటున్నారు. కవిత పార్టీ పెడతారన్నప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. కేసీఆర్ తన తండ్రి అయినా, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కాబట్టి, మరొక పార్టీ కార్యక్రమంలో ఆయన ఫోటో పెట్టడం తగదు అన్న కారణంతో నిర్ణయం తీసుకున్నారని సమాచారం. విశ్లేషకుల ప్రకారం, కేసీఆర్ ఫోటోతో యాత్ర చేస్తే తాను ఏం చేసినా, ఎంత చేసినా ఆ షాడో ఉంటుందే తప్ప పర్సనల్‌ ఎలివేషన్‌ ఉండదన్న సలహాలతోనే... నిర్ణయం తీసుకుని ఉండవచ్చంటున్నారు.

వివరాలు 

నాలుగు నెలల పాటు వివిధ జిల్లాల్లో యాత్ర

కవిత నాలుగు నెలల పాటు వివిధ జిల్లాల్లో యాత్ర చేస్తూ ప్రజల మధ్య ఉంటారు. ఈ సారి కేసీఆర్ ప్రస్తావన లేకుండా తిరగడం,ప్రజల రియాక్షన్‌ ఎలా ఉంటుందో కూడా టెస్ట్‌ చేసుకోవాలనుకుంటున్నారని,అందుకే... బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి ఫోటోను తన జాగృతి పోస్టర్స్‌లో తీసేసినట్టు సమాచారం కవిత సొంత కాళ్లపై నిలబడుతూ, గులాబీ షేడ్‌ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడాలని, స్వంత రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. రేపు తాను పెట్టబోయే కొత్త పార్టీకి వచ్చే మైలేజ్ కన్నా బీఆర్‌ఎస్‌కే ప్లస్‌ అవుతుందన్న లెక్కలు కూడా ఉండి ఉండవచ్చంటున్నారు కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభావం లేని కవిత ప్రయాణం ఎలా ఉండబోతోంది? రేపు ప్రసంగాల్లో ఆమె గత ప్రభుత్వ తప్పిదాలను సైతం ప్రస్తావిస్తారా అన్న ఆసక్తి మాత్రం రాజకీయవర్గాల్లో పెరుగుతోంది.