Narendra modi: గ్లోబల్ సౌత్ ఏకం కావాల్సిన సమయం.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో పౌరుల మరణాన్ని ఖండించిన ప్రధాని మోదీ
ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పౌరుల మరణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఖండించారు. వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో మాట్లాడుతూ, పశ్చిమాసియా ప్రాంతంలో "కొత్త సవాళ్లు" గురించి మాట్లాడిన ప్రధాని మోడీ, ఈ వివాదంలో భారతదేశం "సంయమనం పాటించిందని అన్నారు. మేము చర్చలు,దౌత్యానికి ప్రాధాన్యత ఇచ్చాము. ఇజ్రాయెల్,హమాస్ మధ్య ఘర్షణలో పౌరుల మరణాలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని మోదీ అన్నారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో తన సంభాషణ తర్వాత భారతదేశం పాలస్తీనియన్లకు మానవతా సహాయం పంపిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు గొప్ప ప్రపంచ ప్రయోజనాల కోసం ఏకం కావాల్సిన సమయం ఇది అని ఆయన అన్నారు.