
Israel Backs India: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు ఇజ్రాయెల్ మద్దతు
ఈ వార్తాకథనం ఏంటి
కొన్ని రోజులుగా పాకిస్తాన్‌పై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది.
దానికి అనుగుణంగా మంగళవారం అర్థరాత్రి భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్‌కు దిగాయి.
మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం విజయవంతంగా బాంబుదాడులు చేసి ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పాటు పాకిస్తాన్ ప్రధాన భూభాగంలోని ఉగ్రవాద కేంద్రాలపై తీవ్రంగా దాడి జరిగింది.
ఈ సమయంలో ఇజ్రాయెల్ భారత్‌కు బాసటగా నిలవడం గమనార్హం. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ట్విట్టర్‌లో (X) స్పందిస్తూ, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు.
భారతదేశం చేసిన ఈ దాడులు ఆత్మరక్షణ కోసమేనని చెప్పింది
Details
పాక్ కు మద్దతుగా నిలిచిన టర్కీ
, అమాయక పౌరులపై దాడులకు పాల్పడిన పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
టర్కీ మాత్రం ఈ పరిణామాలపై పాక్‌కు మద్దతుగా స్పందించింది. పాకిస్తాన్‌లో స్థిరంగా లేకపోతున్న భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది.
టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌కు ఫోన్ చేసి తాజా పరిణామాలపై చర్చించారు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఇరు దేశాల నాయకులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో, భారత్ సాహసోపేతంగా సాగించిన దాడులకు ఒకవైపు మద్దతు.. మరోవైపు వ్యతిరేకతల మధ్య భారత్ తన ఉగ్రవాద వ్యతిరేక యుద్ధాన్ని కొనసాగిస్తోంది.