Page Loader
India-Pakistan: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరం.. పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరం.. పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్

India-Pakistan: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరం.. పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2024
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ మరోసారి ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌పై విమర్శలు చేసింది. దీనిపై మన దౌత్యవేత్త భవిక మంగళానందన్ ఘాటుగా స్పందించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి, ఆర్టికల్ 370 రద్దుపై విమర్శలు చేస్తే, భవిక పాక్‌ ఉగ్రవాదాన్ని మద్దతు ఇస్తోందని గట్టిగా తిప్పికొట్టారు. పాకిస్థాన్, సరిహద్దుల దాటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉందని, అలాంటి దేశం శాంతి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు పాకిస్థాన్ ఇలాంటి కుట్రలను జరుపుతూనే ఉందని భవిక అన్నారు.

Details

జమ్మూ, కశ్మీర్, లడఖ్‌లతో భారత్ కు విడదీయరాని అనుబంధం

షరీఫ్ ప్రసంగంలో దాదాపు 20 నిమిషాల పాటు కేవలం కశ్మీర్‌పైనే మాట్లాడిన విషయం తెలిసిందే. పాలస్తీనా ప్రజల మాదిరిగానే జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దును భారత్ ఏకపక్షంగా చేపట్టిందని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచ వేదికలపై పాకిస్థాన్ తరచూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉంది. అయితే భారత్ తరచుగా జమ్మూ, కశ్మీర్, లడఖ్‌లు భారతదేశంలో విడదీయరాని భాగమని స్పష్టం చేస్తూ వస్తోంది.