Omar Abdullah: ఎన్నికల్లో ఓడినప్పుడే ఈవీఎంలను తప్పుపట్టడం సరికాదు
జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈవీఎంలపై ప్రతిపక్ష పార్టీల విమర్శల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోతేనే ఈవీఎంలను తిట్టడం సరికాదన్నారు. ఎన్నికల ప్రక్రియపై నమ్మకం లేని పార్టీలు పోటీ చేయాలని ఆయన సూచించారు. పీఠీఐకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఈవీఎంలను తప్పుబట్టడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ఃఒకసారి గెలిస్తే ఓటింగ్ మెషీన్లపై నమ్మకం చూపి, ఓడినప్పుడు వాటిని తప్పుబట్టడం ఓటర్లను అవమానించడం వంటిదే అని స్పష్టం చేశారు.
ప్రజల తీర్పును స్వీకరించాలి
ఓటర్లు ఎప్పటికప్పుడు తమ తీర్పు మార్చుకుంటారని, ఆ విధానాన్ని గౌరవించడం అవసరమని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. తనను చూసి నేర్చుకోవాలని, తాను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయానని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచానని, ఆ తర్వాత ఓటర్ల తీర్పును గౌరవించానని, కానీ ఎప్పుడూ ఈవీఎంలను తప్పుపట్టలేదని ఆయన స్పష్టం చేశారు. 'ఇండియా' బ్లాక్ కూటమిలో భాగమైన ఒమర్ అబ్దుల్లా బ్యాలెట్ పద్ధతిపై వస్తున్న డిమాండ్లను కూడా వ్యతిరేకించారు. గెలిచినప్పుడు ఓటింగ్ యంత్రాలను ప్రశంసించి, ఓడిపోయినప్పుడు బ్యాలెట్ పద్ధతిపై విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే ఎన్నికల వ్యవస్థపై పూర్తి నమ్మకం చూపాలని, గెలిచినా, ఓడినా ప్రజల తీర్పును స్వీకరించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.