
Jammu and Kashmir Elections 2024: జమ్ముకశ్మీర్'లో ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం - విజేత ఎవరు?
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగింపు తర్వాత నిర్వహించిన ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి.
మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు మూడు విడతల్లో జరిగాయి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమకే అధికారం వస్తుందని ధీమాగా భావిస్తున్నాయి.
కాంగ్రెస్,నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) కూటమిగా ఎన్నికల బరిలో ఉండగా, బీజేపీ, పీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి.
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, హంగ్ అసెంబ్లీ రావచ్చని అంచనా వేశారు.ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్, ఎన్‌సీ, పీడీపీ పార్టీలు ఐదుగురు నామినేటెడ్ ఎమ్మెల్యేలను నియమించడంపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశాయి.
వివరాలు
నౌషేరా నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర
ఈ ఎన్నికల్లో 873 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పశ్చిమ పాకిస్థాన్ శరణార్థులు, వాల్మీకి సమాజం, గూర్ఖా తెగలకు తొలిసారిగా ఓటు హక్కు లభించింది.
2014 ఎన్నికల్లో పోలింగ్ శాతం 65.52% ఉండగా, ఈ సారి 63.45% మాత్రమే నమోదైంది.
నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా రెండు స్థానాల నుండి పోటీ చేయగా, కాంగ్రెస్ నేత తారిఖ్ హమీద్ కర్రా బటమాలూ నియోజకవర్గం నుండి బరిలో నిలిచారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర నౌషేరా నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
వివరాలు
మూడంచెల భద్రత ఏర్పాటు
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రావడం కష్టమని తెలుస్తోంది.
నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమికి ఎక్కువ స్థానాలు రాగలిగినా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధించలేకపోవచ్చని అంచనా వేశారు.
బీజేపీకి కనిష్ఠం 20 నుంచి గరిష్ఠంగా 32 స్థానాలు రావచ్చని తెలిపారు. పీడీపీ మాత్రం చాలా తక్కువ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
భద్రతకు సంబంధించి లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
వివరాలు
తెరపైకి నామినేట్ ఎమ్మెల్యేల అంశం
నామినేటెడ్ ఎమ్మెల్యేలు అంశం ఎన్నికల సమయంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్ర హోంశాఖ సిఫారసు మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ ఐదుగురు నామినేటెడ్ ఎమ్మెల్యేలను నియమించనున్నారు.
2019లో అమలులోకి వచ్చిన జమ్ముకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం,ఈ నియమకాలు జరగనున్నాయి.
ఈ నియమకాలు కశ్మీర్ పండితులు,పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చిన శరణార్థులకు ముఖ్యంగా జరుగుతాయి.
ఈ నియమకాలతో 90 సీట్లున్న అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 48కి చేరుతుంది.కాంగ్రెస్,ఎన్‌సీ, పీడీపీ పార్టీలు దీనికి తీవ్రంగా వ్యతిరేకం వ్యక్తం చేస్తూ, ప్రజల తీర్పును అపహాస్యం చేసినట్లు అవుతుందని విమర్శిస్తున్నాయి.
నామినేషన్ ప్రక్రియను ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేపట్టాలని పార్టీలు డిమాండ్ చేశాయి.
ఇదే విషయంలో కేంద్రం ముందుకెళ్తే, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఎన్‌సీ నేత ఫరూక్ అబ్దుల్లా చెప్పారు.
వివరాలు
కాంగ్రెస్, ఎన్సీ పొత్తు
2014 ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, పీడీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేశాయి. ఈసారి, ఈ రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తున్నాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీ పొత్తుతో బరిలోకి దిగాయి.