Page Loader
Haryana Polls 2024 : హర్యానాలో ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం - విజేత ఎవరు?
హర్యానాలో ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం - విజేత ఎవరు?

Haryana Polls 2024 : హర్యానాలో ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం - విజేత ఎవరు?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2024
10:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 90 శాసనసభ స్థానాలకు మొత్తం 1031 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఉండగా, కాంగ్రెస్‌ ఈసారి విజయం తమదేనని నమ్ముతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా కాంగ్రెస్‌ విజయాన్ని ఊహించాయి. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు.

వివరాలు 

67.90 శాతం ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు

మంగళవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుందని అంచనా వేయబడింది. ఈసారి కూడా బీజేపీ తన విజయాన్ని హ్యాట్రిక్‌గా మలుచుకుంటుందా లేదా కాంగ్రెస్‌ మార్పును తీసుకురాగలదా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాలకు అక్టోబర్‌ 5న పోలింగ్‌ జరగ్గా, 67.90 శాతం ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు.

వివరాలు 

విజయం ఎవరిదో? 

ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ లాడ్వా నుంచి, ప్రతిపక్ష నేత భూపీందర్‌ సింగ్‌ హుడ్డా గర్హి సంప్లా-కిలోయ్ నుంచి పోటీ చేశారు. రెజ్లర్‌ వినేష్ ఫొగట్‌ కాంగ్రెస్‌ తరఫున జులానా నుంచి పోటీచేశారు. సీఎం సైనీ బీజేపీ మూడోసారి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తుండగా, మాజీ సీఎం హుడ్డా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐఎన్‌ఎల్‌డీ-బీఎస్‌పీ కూటమి, జేజేపీ నేత దుశ్యంత్‌ చౌతాలా తమకూ అనుకూలంగా ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా హరియాణాలో తమ మద్దతు లేకుండా ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని పేర్కొంది.

వివరాలు 

2019లోని ఫలితాలు 

2019 ఎన్నికల్లో బీజేపీ 41 స్థానాలు, కాంగ్రెస్‌ 28 స్థానాలు, జేజేపీ 6 స్థానాలు సాధించాయి. ఐఎన్‌ఎల్‌డీ, హరియాణా లోక్‌హిత్‌ పార్టీ చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి. బీజేపీ జేజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, 2024లో బీజేపీ కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్‌ సింగ్‌ సైనీని నియమించడంతో జేజేపీ బీజేపీతో బంధాన్ని తెంచుకుంది.