Page Loader
Jammu and Kashmir: జీతం కోసం ఎదురుచూస్తున్న జమ్మూకశ్మీర్‌ ఎమ్మెల్యేలు 
జీతం కోసం ఎదురుచూస్తున్న జమ్మూకశ్మీర్‌ ఎమ్మెల్యేలు

Jammu and Kashmir: జీతం కోసం ఎదురుచూస్తున్న జమ్మూకశ్మీర్‌ ఎమ్మెల్యేలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2024
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో (Jammu and Kashmir) కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచినా, ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు (MLA) తొలి నెల వేతనం అందుకోలేదని సమాచారం. ఈ విషయం శాసనసభ స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ దృష్టికి చేరగా, ఎమ్మెల్యే వేతనాలకు సంబంధించి చట్టపరమైన నిబంధనలపై వివరణ కోరుతూ ఆయన జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాశారు. ఈ అంశంపై తక్షణ వివరణ ఇవ్వాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీని ఆయన కోరారు. ప్రస్తుత నిబంధనలు సరిపోవని భావించిన సందర్భంలో, ఎమ్మెల్యేల జీతభత్యాలు పెంచేందుకు శాసనసభ బిల్లును ప్రవేశపెట్టే అధికారం కలిగి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్ర హోదా కోల్పోయిన జమ్మూ కశ్మీర్

జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, అసెంబ్లీ తన స్వంత చట్టాలను రూపొందించే వరకు, ఎమ్మెల్యే వేతనాలు లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. అయితే, వేతనాల మార్పులు లేదా అలవెన్సులపై ప్రతిపాదనలు చేయడంలో అసెంబ్లీకి పూర్తి అధికారం ఉంటుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్ర హోదా కోల్పోయిన జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. అనంతరం జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఒమర్ అబ్దుల్లా, రాష్ట్ర హోదాను తిరిగి పొందేందుకు కృషి చేస్తున్నారు. ఆయన మంత్రివర్గం చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు.