LOADING...
Jagdeep Dhankhar : ఎమ్మెల్యే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న జగదీప్ ధన్‌కడ్.. ఎంత పెన్షన్ వస్తుందంటే? 
ఎమ్మెల్యే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న జగదీప్ ధన్‌కడ్.. ఎంత పెన్షన్ వస్తుందంటే?

Jagdeep Dhankhar : ఎమ్మెల్యే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న జగదీప్ ధన్‌కడ్.. ఎంత పెన్షన్ వస్తుందంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2025
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ తాజాగా ఎమ్మెల్యే పెన్షన్ కోసం దరఖాస్తు చేశారు. ఆయన 1993-1998 మధ్య రాజస్థాన్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ఇప్పుడు ఆ కాలానికి సంబంధించిన పెన్షన్ పునరుద్ధరణ కోసం అప్లికేషన్ సమర్పించగా, అసెంబ్లీ దానిని ధృవీకరించింది. అయితే ఆయన ఆ సమయంలో ఏ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారన్న ఆసక్తి కలిగింది.

Details

ధన్‌కడ్ రాజకీయ ప్రయాణం

74 ఏళ్ల జగదీప్ ధన్‌కడ్ తొలిసారి 1991-1993 ** వరకు రాజస్థాన్‌లోని ఝుంఝును నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో ఆయన జనతా దళ్ తరఫున పోటీ చేసి గెలిచారు. అనంతరం చంద్రశేఖర్ ప్రభుత్వంలో సహాయమంత్రిగా కూడా పనిచేశారు. 1993లో లోక్‌సభకు మళ్లీ పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రాజస్థాన్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు ఆ కాలానికి సంబంధించిన పెన్షన్ కోసం ఆయన దరఖాస్తు చేశారు.

Details

బీజేపీ వైపు అడుగులు

జనతాదళ్, కాంగ్రెస్ పార్టీలలో పనిచేసిన ధన్‌కడ్, 2003లో బీజేపీలో చేరారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ క్యాంపెయిన్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2016లో బీజేపీ లీగల్ సెల్ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. తరువాత 2019జూలై 20న ఆయనను పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమించారు. ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేసిన సందర్భంగా, 2022 జూలై 17న ఆ పదవికి రాజీనామా చేశారు. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ ఏడాది ఆగస్టు 11న పార్లమెంట్ సమావేశాల మొదటి రోజే, అనారోగ్య కారణాలను చూపిస్తూ ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఆయన నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో విబేధాలే అసలు కారణమని ప్రచారం జరిగింది.

Details

పెన్షన్, బెనిఫిట్స్ వివరాలు

ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినందుకు నెలకు రూ.35,000 పెన్షన్ లభిస్తుంది. 70 ఏళ్లు దాటిన వారికి అదనంగా 20% పెన్షన్ ఇస్తారు. దీంతో ఆయనకు సుమారు రూ.42,000 వస్తుంది. ఒకసారి ఎంపీగా సేవలందించినందుకు మరో రూ.45,000 పెన్షన్ అర్హత ఉంది. ఉపరాష్ట్రపతిగా పనిచేసినందుకు నెలకు రూ.2 లక్షల పెన్షన్ లభిస్తుంది. అదనంగా ఆయనకు టైప్-8 బంగ్లా కేటాయిస్తారు. సిబ్బందిగా ఒక పర్సనల్ సెక్రటరీ, ఒక అడిషనల్ పర్సనల్ సెక్రటరీ, ఒక పర్సనల్ అసిస్టెంట్, ఒక ఫిజీషియన్, ఒక నర్సింగ్ ఆఫీసర్, నలుగురు అటెండెంట్స్ ఉంటారు.