Page Loader
రన్నింగ్ ట్రైన్‌లో ఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు; నలుగురు మృతి
రన్నింగ్ ట్రైన్‌లో ఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు; నలుగురు మృతి

రన్నింగ్ ట్రైన్‌లో ఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు; నలుగురు మృతి

వ్రాసిన వారు Stalin
Jul 31, 2023
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) జవాన్ కదుతున్న రైలులో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ట్రైన్‌లో మొత్తం నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు ప్రయాణికులు, ఒక ఏఎస్ఐ ఉన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. జవాన్ తన ఆటోమేటిక్ వెపన్‌తో కాల్పులు జరిపాడని అధికారులు చెప్పారు. జైపూర్-ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు జరిగాయి. నిందితుడుని ఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్టు చేశారు. అతడిని బోరివలి స్టేషన్‌కు తరలించారు. జవాన్ మానసిక స్థితి బాగాలేదని అధికారులు చెప్పారు. జవాన్ మానసిక పరిస్థితి సరిగా లేనప్పుడు విధుల్లో ఎలా ఉన్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో, పోలీసులు కేసును దర్యాప్తు ప్రారంభించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆర్‌పీఎఫ్ జవాన్ విచక్షణా రహితంగా కాల్పులు