
Karni Sena chief murder : షూటర్‌కు ఆయుధాలు అందించినందుకు జైపూర్ మహిళ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు పాల్పడిన షూటర్లలో ఒకరికి ఆయుధాలు అందించి, వసతి ఏర్పాటు చేసిన మహిళను రాజస్థాన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
డిసెంబర్ 5న హత్య చేయడానికి ముందు జైపూర్‌లోని ఓ అద్దె ఫ్లాట్‌లో దాదాపు వారం రోజులు బస చేసిన షూటర్లలో ఒకరైన నితిన్ ఫౌజీకి పూజా సైనీ,ఆమె భర్త మహేంద్ర మేఘవాల్ ఆయుధాలు అందించారని పోలీసులు తెలిపారు.
ఫౌజీ తన కోసం రెండు పిస్టల్స్,మ్యాగజైన్స్ తీసుకోగా, రాథోడ్ కోసం ఒక పిస్టల్,రెండు మ్యాగజైన్లను తీసుకున్నాడు. ఫౌజీ కోసం పూజ ఆహారాన్ని సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
సమీర్ అనే హిస్టరీ షీటర్ మేఘవాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Details
నితిన్ ఫౌజీతో ముగ్గురికి పరిచయం
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న రాజస్థాన్‌లోని భోంద్సీ జైలులో ఉన్న ముగ్గురు ఖైదీలను గోగమేడి హత్య కేసుకు సంబంధించి జైపూర్ పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.
కర్ణి సేన చీఫ్ హత్యకేసులో ప్రధాన షూటర్ నితిన్ ఫౌజీతో ముగ్గురికి పరిచయం ఉందని పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు ఫౌజీతో కలిసి హత్యాయత్నం కేసులో కూడా ఉన్నారు.
Details
సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు బాధ్యత వహించిన గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా
ఇద్దరు షూటర్లు, నితిన్ ఫౌజీ,రోహిత్ రాథోడ్, వారి సహచరులలో ఒకరైన ఉధమ్ సింగ్‌లను ఢిల్లీ పోలీసులు,రాజస్థాన్ పోలీసుల సంయుక్త బృందం శనివారం రాత్రి చండీగఢ్‌లో అరెస్టు చేసినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.
వారిని స్థానిక కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ ఏడు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.
గోగమేడిని నవంబర్ 5న జైపూర్‌లోని తన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
హత్య జరిగిన వెంటనే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా హత్యకు బాధ్యత వహించాడు.