LOADING...
Jaishankar: 'యుఎన్ మాకు చెప్పాల్సిన అవసరం లేదు': ఎస్ జైశంకర్ 
Jaishankar: 'యుఎన్ మాకు చెప్పాల్సిన అవసరం లేదు': ఎస్ జైశంకర్

Jaishankar: 'యుఎన్ మాకు చెప్పాల్సిన అవసరం లేదు': ఎస్ జైశంకర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 05, 2024
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ గురువారం భారతదేశంలో ఎన్నికలపై UN సీనియర్ అధికారి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. దేశంలో ఎన్నికలు "స్వేచ్ఛగా , నిష్పాక్షికంగా" జరగాలని ప్రపంచ సంస్థ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. భారతదేశంలో ప్రజల "రాజకీయ, పౌర హక్కులు"కు రక్షణ ఉంటుందని , ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ,నిస్పక్షపాతంగా ఓటు వేసే వాతావరణంలో ఉంటుందని తాము ఆశిస్తున్నామని UN సెక్రటరీ జనరల్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా జైశంకర్‌ పైవిధంగా అన్నారు. లోక్‌సభ ఎన్నికలలో తన మంత్రివర్గ సహచరుడు, బిజెపి అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ కోసం ప్రచారం చేయడానికి తిరువనంతపురం వచ్చిన జైశంకర్, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు అంశాలపై స్పందించారు.

జై శంకర్ 

భారత ప్రజలే ఎన్నికలు స్వేచ్ఛగా ,నిష్పక్షపాతంగా జరిగేలా చూస్తారు

అపోహలు, అసత్యాలతో కూడిన ప్రశ్నకు బదులిస్తూ భారత ఎన్నికలపై ఐరాస ప్రతినిధి స్పందించారని వ్యాఖ్యానించారు. "మన ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని ఐక్యరాజ్యసమితి చెప్పాల్సిన అవసరం లేదు. మాకు భారతదేశ ప్రజలు ఉన్నారు. వారే ఎన్నికలు స్వేచ్ఛగా ,నిష్పక్షపాతంగా జరిగేలా చూస్తారు. కాబట్టి, దాని గురించి చింతించాల్సిన పనిలేదు," అని జైశంకర్‌ అన్నారు. గత వారం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం నేపథ్యంలో రాబోయే జాతీయ ఎన్నికలకు ముందుభారతదేశంలో "రాజకీయ అశాంతి" గురించి ఇటీవల ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు UN సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్‌ స్పందించారు.

డుజారిక్ 

కేజ్రీవాల్‌ అరెస్టు, కాంగ్రెస్‌ ఖాతాల వ్యవహారంపై స్పందించిన జర్మనీ, అమెరికా 

"భారత్‌ సహా ఎన్నికలు జరగనున్న ఏ దేశంలోనైనా ప్రజల రాజకీయ, పౌర హక్కుల రక్షణ ఉంటుందని.. ప్రతి ఒక్కరి హక్కులు రక్షించబడతాయని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిష్పాక్షిక వాతావరణంలో ఓటు వేయగలరని మేము చాలా ఆశిస్తున్నాం" అని డుజారిక్ అన్నారు. అంతకుముందు జర్మనీ, అమెరికా సైతం కేజ్రీవాల్‌ అరెస్టు, కాంగ్రెస్‌ ఖాతాల వ్యవహారంపై స్పందించాయి. ఒక సార్వభౌమ దేశ అంతర్గత వ్యవహారాలపై జోక్యం తగదంటూ భారత్‌ దీటుగానే బదులిచ్చింది.