Page Loader
First visit since Galwan clash: చైనా ఉపాధ్యక్షుడిని కలిసిన జైశంకర్.. ద్వైపాక్షిక సంబంధాల్లో మెరుగుదల
చైనా ఉపాధ్యక్షుడిని కలిసిన జైశంకర్.. ద్వైపాక్షిక సంబంధాల్లో మెరుగుదల

First visit since Galwan clash: చైనా ఉపాధ్యక్షుడిని కలిసిన జైశంకర్.. ద్వైపాక్షిక సంబంధాల్లో మెరుగుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల చైనా రాజధాని బీజింగ్‌లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను సమావేశమయ్యారు. ఈపర్యటన నేపథ్యంలో భారత్-చైనా మధ్య సానుకూల చర్చలు జరుగుతాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో చైనా షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో)అధ్యక్ష పదవికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. బీజింగ్‌కు చేరుకున్న తర్వాత ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను కలవడం సంతోషంగా ఉందని జైశంకర్ తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు. చైనా ఎస్‌సీవో అధ్యక్ష పదవికి భారతదేశం సంపూర్ణ మద్దతు ఇస్తున్న విషయాన్ని ఉపాధ్యక్షుడికి తెలియజేశానని తెలిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో మెరుగుదల కనిపిస్తున్నదని,తన పర్యటనలో జరిగే చర్చలు ఈ సానుకూల దిశను మరింత ముందుకు తీసుకెళ్తాయని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హాన్ జెంగ్‌ తో జై శంకర్ 

వివరాలు 

రెండు దేశాల సంబంధాలు మెరుగవుతున్నాయి: జైశంకర్

గతంలో రష్యాలోని కజాన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన భేటీ అనంతరం రెండు దేశాల సంబంధాలు మెరుగవుతున్నాయని జైశంకర్ అభిప్రాయపడ్డారు. భారత్-చైనా మధ్య దౌత్య సంబంధాలు 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు. కైలాశ్ మానసరోవర యాత్ర పునఃప్రారంభంపై అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ముఖ్యమైన ఆర్థిక శక్తులుగా ఉన్న భారత్-చైనా దేశాల మధ్య అభిప్రాయాలు, దృక్పథాల మార్పిడి అత్యంత అవసరమని స్పష్టంచేశారు. తాను చేపట్టిన ఈ పర్యటన ఇలాంటి ముఖాముఖి చర్చలకు దారితీస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.