LOADING...
S Jaishankar: ఉగ్రవాదం విషయంలో ఎలాంటి సమర్ధింపు ఉండకూడదు: రష్యా పర్యటనలో జైశంకర్ వ్యాఖ్య
ఉగ్రవాదం విషయంలో ఎలాంటి సమర్ధింపు ఉండకూడదు: రష్యా పర్యటనలో జైశంకర్ వ్యాఖ్య

S Jaishankar: ఉగ్రవాదం విషయంలో ఎలాంటి సమర్ధింపు ఉండకూడదు: రష్యా పర్యటనలో జైశంకర్ వ్యాఖ్య

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2025
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని సహించరాదని భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ ప్రపంచ దేశాలకు సందేశం ఇచ్చారు. రష్యాలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ''ఉగ్రవాదానికి ఎలాంటి న్యాయం చేయలేం దానిని సహించడమంటే ప్రజలకు ప్రమాదం కలిగించడమే. భారత ప్రజలను ఉగ్రవాదం నుండి రక్షించుకోవాల్సిన హక్కు దేశానికి ఉంది'' అని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అన్ని దేశాలకూ ఒకటే ప్రాధాన్యంగా ఉండాలని, రాజీలేని చర్యలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇటీవలి దిల్లీ ఘటనను ఆయన ప్రస్తావించారు. ఎర్రకోట సమీపంలో కారులో జరిగిన పేలుడులో 13 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

వివరాలు 

భారత పర్యటనకు వచ్చే నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 

దేశాన్ని కుదిపేసిన ఆ ఘటనను కేంద్రం ఉగ్రదాడిగా గుర్తించి,దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐఏకు అప్పగించింది. ఈనేపథ్యంలోనే జైశంకర్ చేసిన వ్యాఖ్యల ప్రాధాన్యం మరింత పెరిగింది. మూడురోజుల విదేశీ పర్యటనలో భాగంగా జైశంకర్ ప్రస్తుతం రష్యాలో ఉన్నారు. ఎస్‌సీఓ సమావేశానికి హాజరవ్వడానికి తోడు,రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌తో కూడా ఆయన చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలు,ప్రాంతీయ పరిణామాలు,అంతర్జాతీయ అంశాలు వంటి పలు విషయాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అదే సమయంలో,వచ్చే నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌ పర్యటించనున్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం భారత్-రష్యాల మధ్య జరిగే శిఖరాగ్రసమావేశంలో పాల్గొనడానికి ఆయన మన దేశానికి రానున్నారు. 2021 తర్వాత పుతిన్ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి.