Page Loader
Jammu and Kashmir: నలుగురు ఉగ్రవాదుల ఫోటోలు విడుదల.. రూ.5 లక్షల రివార్డ్స్ ప్రకటించిన పోలీసులు
నలుగురు ఉగ్రవాదుల ఫోటోలు విడుదల.. రూ.5 లక్షల రివార్డ్స్ ప్రకటించిన పోలీసులు

Jammu and Kashmir: నలుగురు ఉగ్రవాదుల ఫోటోలు విడుదల.. రూ.5 లక్షల రివార్డ్స్ ప్రకటించిన పోలీసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 10, 2024
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్ లో ఈ మధ్య ఉగ్రదాడులు పెరిగిపోతున్నాయి. కథువా జిల్లాలోని మల్హర్, బానీ, సియోజ్‌ధర్‌లోని ధోక్స్ లలో చివరిగా కనిపించిన నలుగురు ఉగ్రవాదుల స్కెచ్ లను పోలీసులు విడుదల చేశారు. అదే విధంగా కథువాలో ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా పంచుకుంటే వారికి రూ.5 లక్షలు రివార్డు అందజేస్తామని పోలీసులు బహిరంగ ప్రకటన చేశారు. పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవాలంటే ప్రజల సాయం కావాలని పోలీసులు ఉగ్రవాదుల స్కెచ్ లను రిలీజ్ చేశారు.

Details

నిఘా పెంచిన పోలీసులు

జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో దాదాపు 40 నుంచి 50 మంది ఉగ్రవాదులు గుంపులుగా తిరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. రాజౌరి, రియాసి జిల్లాలో పాటు మరికొన్ని ప్రాంతాలతో పోలీసులు నిఘా పెంచారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే శాంతియుతంగా ఉన్న జమ్మూ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో 14 తీవ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 11 మంది భద్రతా సిబ్బందితో పాటు ఒక గ్రామ రక్షణ గార్డు, ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. మొత్తం మీద 27 మంది ప్రాణాలు కోల్పోయిన నిఘా వర్గాలు పేర్కొన్నాయి.