Page Loader
సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం; ఏకే 47 మ్యాగజైన్, నగదు స్వాధీనం 
సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చేసిన సైన్య; ఏకే 47 మ్యాగజైన్, నగదు స్వాధీనం

సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం; ఏకే 47 మ్యాగజైన్, నగదు స్వాధీనం 

వ్రాసిన వారు Stalin
Apr 13, 2023
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్‌బనీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం గురువారం పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చేసింది. ఈ సందర్భంగా 131 రౌండ్ల ఏకే -47 మ్యాగజైన్‌, రూ. 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్ నుంచి సరిహద్దు రేఖను దాటి భారత భూభాగంలోకి చొరబడిన డ్రోన్‌ను బుధవారం అర్థరాత్రి సుందర్‌బని సెక్టార్‌లోని బెరీ పట్టాన్ ప్రాంతంలో పేల్చేసినట్లు జమ్ము డిఫెన్స్ పీఆర్‌ఓ వెల్లడించారు.

ఆర్మీ

డ్రోన్‌పై విచారణ చేపట్టిన అధికారులు

ఈ డ్రోన్‌పై ఎక్కడిది? ఎలా వచ్చింది? అనే కోణంలో విచారిస్తున్నట్లు సైనిక అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు ఏప్రిల్ 1న, సరిహద్దు భద్రతా దళాలు పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌పై కాల్పులు జరిపారు. దీంతో అది పొరుగు దేశానికి తిరిగి వెళ్లింది. సాంభా జిల్లాలో పాక్ సరిహద్దలో బీఎస్ఎఫ్ దళాలు ఎగురుతున్న వస్తువు‌పై కాల్పులు జరపినట్లు అధికారులు పేర్కొన్నారు. 1వ తేదీన అర్ధరాత్రి 12:15 గంటల ప్రాంతంలో డ్రోన్‌ కనిపించిందని అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సరిహద్దు దళాలు స్వాధీనం చేసుకున్న డ్రోన్, నగదు, బుల్లెట్లు