Page Loader
జమ్ముకశ్మీర్: ట్రక్కు లోయలో పడి నలుగురు మృతి 
జమ్ముకశ్మీర్: ట్రక్కు లోయలో పడి నలుగురు మృతి

జమ్ముకశ్మీర్: ట్రక్కు లోయలో పడి నలుగురు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2023
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో మంగళవారం ట్రక్కు అదుపుతప్పి లోతైన లోయలోకి బోల్తా పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. బనిహాల్ ప్రాంతంలోని షేర్ బీబీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. జమ్ము నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ట్రక్కును భారీ బండరాయి ఢీకొట్టి రోడ్డుపై నుంచి జారిపడిందని అధికారులు తెలిపారు. ట్రక్కు లోతైన లోయలో పడిపోవడంతో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు,రెస్క్యూ టీమ్‌లు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Details 

జమ్ము -శ్రీనగర్ NH బ్లాక్ 

మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. "కిష్త్వారీ పథేర్ బనిహాల్ వద్ద కొండచరియలు విరిగిపడిన కారణంగా జమ్మూ-శ్రీనగర్ NH బ్లాక్ చేశారు. ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ల అనుమతి లేకుండా ప్రజలు NH-44లో ప్రయాణించవద్దని అని ట్రాఫిక్ అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 జమ్మూ-శ్రీనగర్ NH బ్లాక్