జనసేన-టీడీపీ పొత్తు ఖరారు.. ఇక యుద్ధమేనన్న పవన్ కళ్యాణ్!
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన-టీడీపీ పొత్తు గురించి గతంలో వచ్చిన వార్తలపై క్లారిటీ వచ్చేసింది.
ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా జనసేన-టీడీపీ కలిసి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇది తమ ఇద్దరి భవిష్యత్తు కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసమని పవన్ కళ్యాణ్ తెలిపారు.
గత నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన చూస్తున్నామని, జగన్ రెడ్డి యుద్ధానికి సిద్ధమంటే, తాము కూడా యుద్ధానికి సిద్ధమేనని తెలిపారు.
ఇక టీడీపీ జనసేన పొత్తుకు బీజేపీ అంగీకరించిన పక్షంలో పవన్ బీజేపీకి దూరమవుతారా అనే ప్రశ్న సైతం వ్యక్తమవుతోంది.
Details
చంద్రబాబు రాజకీయ నేత, జగన్ ఆర్థిక నేరస్థుడు : పవన్ కళ్యాణ్
ఇవాళ చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని, వైసీపీని సమిష్టిగా ఎదుర్కొనే సమయం అసన్నమైందని పవన్ కళ్యాన్ చెప్పారు.
చంద్రబాబు రాజకీయ నేత అని, జగన్ ఆర్థిక నేరస్థుడని, హైటెక్ సిటీ సృష్టించిన వ్యక్తిని జైల్లో పెట్టడం బాధాకరమన్నారు.
తాను తీసుకున్న నిర్ణయాలు కొందరికి ఇబ్బందిగా ఉంటాయని, మోదీకి మద్దతు తెలిపిన సమయంలో తనని అందరూ తిట్టారని, అయితే తాను ఓ నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గననని స్పష్టం చేశారు.
చంద్రబాబు పాలన, విధానపరమైన అభిప్రాయ బేధాలు ఉండొచ్చు కానీ చంద్రబాబు అనుభవం, అసమర్థతపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.
ఇక పోలీసు వ్యవస్థ ఇంత బానిసత్వంగా ఉంటే ఎవరేం చేయలేరన్నారు.