
Kerala: కేరళను వణికిస్తున్న జపనీస్ ఎన్‌సెఫలైటిస్.. 26 మంది మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో జపనీస్ ఎన్‌సెఫలైటిస్ (Japanese Encephalitis) వ్యాధి మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. గడచిన వారం రోజుల వ్యవధిలో ఈ వైరస్ బారిన పడి 12 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇప్పటివరకు ఈ ఏడాది ఈ వ్యాధితో మృతిచెందిన వారి సంఖ్య 26కి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి ప్రభావం కేరళలోని మొత్తం 35 జిల్లాలకుగాను 33 జిల్లాల్లో ఈ జపనీస్ ఎన్‌సెఫలైటిస్ వ్యాప్తి కనిపిస్తోంది. దిమా హసావో, హెయిలకండి జిల్లాలు మినహాయింపు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఆరోగ్య శాఖ అధికారులను హెచ్చరిస్తూ విస్తృత చర్యలు ప్రారంభించింది.
Details
కేసుల సంఖ్య 300 దాటింది
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 జపనీస్ ఎన్‌సెఫలైటిస్ కేసులున్నట్టు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో సగం వరకు కేవలం కేరళలోనే ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధులకే ముప్పు ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఈ వైరస్ ముఖ్యంగా 10 సంవత్సరాల లోపు చిన్నారులు, 60 సంవత్సరాల పైబడిన వృద్ధులు అనే రెండు వయసు గ్రూపులకు ఎక్కువ ప్రమాదం కలిగించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అప్రమత్తతతోనే రక్షణ ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వెక్టార్ బోర్న్ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రిపూట దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. ఈ వ్యాధిని నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు.