Page Loader
లోక్‌స‌భ ఎన్నిక‌లపై దేవెగౌడ కీలక వ్యాఖ్యలు.. ఒంట‌రిగా బరిలోకి దిగుతామని స్పష్టం
లోక్‌స‌భ ఎన్నిక‌లపై మాజీ ప్ర‌ధాని కీలక వ్యాఖ్యలు.. ఒంట‌రిగా బరిలోకి దిగుతామని స్పష్టం

లోక్‌స‌భ ఎన్నిక‌లపై దేవెగౌడ కీలక వ్యాఖ్యలు.. ఒంట‌రిగా బరిలోకి దిగుతామని స్పష్టం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 25, 2023
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనతాదళ్ సెక్యులర్ (JDS) పార్టీ కీలక నిర్ణయం వెల్లడించింది. రానున్న ఎన్నిక‌ల్లో జ‌న‌తాద‌ళ్ ఒంట‌రిగానే పోటీ చేయనుందని ప్రకటించింది. ఈ మేరకు మాజీ ప్రధాన మంత్రి, ఆ పార్టీ అధినేత హెచ్‌డీ దేవెగౌడ వెల్లడించారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ కలిసి వెళ్లాలని జేడీఎస్ అనుకుంది. కానీ ఇప్పుడు అటు ఎన్డీఏతో గానీ ఇటు ఇండియా(INDIA)తో గానీ ఎటువంటి పొత్తు ఉండ‌బోదని ఆయ‌న తెలిపారు. ఇండిపెండెంట్‌గానే జేడీఎస్ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు బెంగుళూరులో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అయిదారు సీట్లు వరకు గెలుచుకుంటుందని దేవెగౌడ విశ్వాసం వ్యక్తం చేశారు.

DETAILS

కుమారస్వామి ప్రకటనకు విరుద్ధంగా దౌవ‌గౌడ కామెంట్స్ 

జేడీఎస్ పార్టీకి బ‌లం ఉన్న చోటే అభ్య‌ర్థుల్ని నిలబెడతామని మాజీ ప్రధాని దెేవెగౌడ వివరించారు. మరోవైపు కర్ణాటక మాజీ సీఎం, దేవ‌గౌడ కుమారుడు కుమార‌స్వామి కొద్ది రోజుల కిందట రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసే పోటీ చేయ‌నున్న‌ట్లు ప్రకటించడం గమనార్హం. కాంగ్రెస్‌ను ఢీకొట్టేందుకు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోనున్నామని కుమార‌స్వామి గత వారం కిందటే చెప్పారు. ప్రస్తుతం కుమారస్వామి ప్రకటనకు విరుద్ధంగా దౌవ‌గౌడ హాట్ పొలిటికల్ కామెంట్స్ చేశారు. తాజాగా అసెంబ్లీలో ఐఏఎస్ బదిలీ అంశంపై బీజేపీ సభ్యుల నిరసనల నేపథ్యంలో 10 మంది ఆ పార్టీ సభ్యుల్ని స్పీకర్ స‌స్పెండ్ చేశారు. దీంతో సమావేశాల తీరును నిరసిస్తూ బీజేపీ సభ్యులు సభను బాయ్ కాట్ చేయగా జేడీఎస్‌ అనుసరించింది.