Page Loader
Z-Morh Tunnel : జెడ్-మోర్ సొరంగం.. కాశ్మీర్-లడఖ్ రవాణాకు కీలక మైలురాయి
జెడ్-మోర్ సొరంగం.. కాశ్మీర్-లడఖ్ రవాణాకు కీలక మైలురాయి

Z-Morh Tunnel : జెడ్-మోర్ సొరంగం.. కాశ్మీర్-లడఖ్ రవాణాకు కీలక మైలురాయి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2025
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జమ్ముకశ్మీర్‌ గందర్బల్‌ జిల్లాలో జెడ్-మోర్‌ సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మోదీ 12వసారి జమ్ము కాశ్మీర్‌ను సందర్శించనున్నారు. జెడ్-మోర్ సొరంగం జమ్ముకశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన సోనమార్గ్‌కు ఏవిధమైన వాతావరణ పరిస్థితుల్లోనూ సరఫరా అందేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ సొరంగం కాశ్మీర్, లడఖ్‌ల మధ్య రవాణా సంబంధాలను సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి ప్రారంభ కార్యక్రమంలో సొరంగ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులతో కూడా సంభాషించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు

Details

 జెడ్-మోర్ సొరంగ మార్గం వివరాలు 

పొడవు: జెడ్-మోర్ సొరంగ మార్గం 6.4 కిలోమీటర్ల పాటు రెండు దిశల రవాణాకు అనుకూలంగా ఉంటుంది. స్థానం: ఈ సొరంగం కాశ్మీర్‌లోని గందర్బల్‌ జిల్లాలో సోనమార్గ్‌ను కంగన్ పట్టణంతో అనుసంధానిస్తుంది. ఖర్చు: ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2,400 కోట్లు ఖర్చయింది. సాంకేతికత: ఈ సొరంగం న్యూ ఆస్ట్రియన్ టన్నలింగ్ మెథడ్ (NATM)తో నిర్మితమైంది. వాహన రవాణా సామర్థ్యం: గంటకు 1,000 వాహనాలు 80 కిలోమీటర్ల గరిష్ట వేగం వేగంతో ప్రయాణించగలవు.

Details

ప్రాజెక్టు ప్రాముఖ్యత

జెడ్-మోర్ సొరంగ మార్గం ద్వారా పర్యాటక రంగానికి లబ్ధి చేకూరనుంది. సోనమార్గ్, 'మీడో ఆఫ్ గోల్డ్' అని పిలవబడే ఈ ప్రాంతం, ఇప్పుడు ఏడాది పొడవునా అందుబాటులో ఉండనుంది. పర్యాటక రంగానికి ప్రాధాన్యత: వింటర్ టూరిజం, అడ్వెంచర్ స్పోర్ట్స్ వంటి కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది. 2. వ్యాపార వృద్ధి: సోనమార్గ్ చేరుకునే సమయం గణనీయంగా తగ్గడంతో వ్యాపారాలు మరింత లాభసాటి అవుతాయి. 3. ఆర్థిక అభివృద్ధి: సొరంగం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ప్రోత్సాహం లభిస్తుంది. భారత రక్షణ రంగానికి వ్యూహాత్మక ప్రాధాన్యత ఈ సొరంగం లడఖ్ ప్రాంతానికి ఏడాది పొడవునా చేరుకోగల విధంగా మారుస్తుంది.ఇది కేవలం పర్యాటకానికి మాత్రమే కాకుండా, కాశ్మీర్,లడఖ్‌కు మధ్య వాణిజ్యం,రవాణా వ్యవస్థలకు ప్రాముఖ్యతనిస్తుంది.

Details

జమ్ము-కాశ్మీర్‌ సొరంగ ప్రాజెక్టులు

జెడ్-మోర్ సొరంగ మార్గం జమ్ము-కాశ్మీర్‌లో నిర్మాణంలో ఉన్న 31 సొరంగ మార్గాల్లో ఒకటిగా ఉంది. వీటిలో 20 సొరంగాలు జమ్ము-కాశ్మీర్‌లో, 11 సొరంగాలు లడఖ్‌లో నిర్మించనున్నారు. జెడ్-మోర్ సొరంగ మార్గం సోనమార్గ్‌ను ఏడాది పొడవునా పర్యాటక ప్రాంతంగా మారుస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ఇది స్థానిక వ్యాపారాలకు, వింటర్ టూరిజానికి కొత్త అవకాశాలు కల్పిస్తుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రారంభించిన మోదీ