Page Loader
JEE Main 2025 Results : జేఈఈ (మెయిన్) ఫలితాలు విడుదల.. 100 పర్సంటైల్‌తో ఇద్దరు తెలుగు విద్యార్థులు శభాష్!
జేఈఈ (మెయిన్) ఫలితాలు విడుదల.. 100 పర్సంటైల్‌తో ఇద్దరు తెలుగు విద్యార్థులు శభాష్!

JEE Main 2025 Results : జేఈఈ (మెయిన్) ఫలితాలు విడుదల.. 100 పర్సంటైల్‌తో ఇద్దరు తెలుగు విద్యార్థులు శభాష్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 11, 2025
05:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న జేఈఈ (మెయిన్) ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ అధికారులు, తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోర్ ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. జేఈఈ (మెయిన్) పరీక్షల వివరాలు దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్-1 పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి స్కోర్‌ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Details

 ఇద్దరు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్ 

ఈసారి జేఈఈ మెయిన్ పరీక్షలకు 13,11,544 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 12,58,136 మంది పరీక్ష రాశారు. మొత్తం 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్ సాధించి టాపర్‌గా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి బాని బ్రత మాజీ 100 పర్సంటైల్‌ సాధించడం విశేషం. ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జరుగుతాయి. మొదటి విడత స్కోరుతో సంతృప్తి చెందని అభ్యర్థులు రెండో విడత రాస్తారు. ఇద్దింటిలో ఉత్తమ స్కోర్ పరిగణనలోకి తీసుకుని విద్యార్థులకు ర్యాంకులు కేటాయిస్తారు.

Details

జేఈఈ అడ్వాన్స్‌డ్ & ఐఐటీ ప్రవేశాలు

రెండో విడత పరీక్ష అనంతరం సామాజిక వర్గ రిజర్వేషన్లకు అనుగుణంగా 2.50 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత పొందుతారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరుగైన ప్రతిభ చూపిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రఖ్యాత ఐఐటీల్లో ప్రవేశాలు లభిస్తాయి.