
Naresh Goyal arrest: జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ అరెస్టయ్యారు. కెనరా బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో గోయల్‌ను ఆదివారం ఈడీ ప్రశ్నించింది. అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించింది. ఈ మేరకు, విచారణ నిమిత్తం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయానికి తరలించింది.
మే 5న గోయల్ నివాసం, ఆఫీసులతో పాటు ముంబైలోని 7ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. 2023 మేలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.
గతేడాది నవంబర్ 11న గోయల్ పై మోసం, కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, ఉద్దేశపూర్వకంగా దుష్ప్రవర్తనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది.
25ఏళ్ల పాటు సేవలు అందించిన జెట్ ఎయిర్‌వేస్, ఏప్రిల్ 2019లో కార్యకలాపాలను నిలిపేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కెనరా బ్యాంకు రూ.538కోట్లు టోకరా
#NareshGoyal , the founder of #JetAirways has been arrested by ED in ₹538 crore bank fraud case . pic.twitter.com/FCGivxV1LG
— Amitabh Chaudhary (@MithilaWaala) September 1, 2023