Page Loader
Telangana: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ 
Telangana: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్

Telangana: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 19, 2024
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. రాధాకృష్ణన్ ను అడిషనల్ గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. తనకు అదనపు బాధ్యత ఇచ్చినందుకు రాధాకృష్ణన్, రాష్ట్రపతి ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్‌గా తన స్వంత బాధ్యతలతో పాటు తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా విధులను నిర్వర్తిస్తారు. కాగా, సోమవారం తమిళసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు తెలంగాణ భాద్యతలు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సీపీ రాధాకృష్ణన్ చేసిన ట్వీట్