Page Loader
Jharkhand: అనుమానాస్పద స్థితిలో జార్ఖండ్‌ కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు వినయ్‌ సింగ్‌ మృతి 
అనుమానాస్పద స్థితిలో జార్ఖండ్‌ కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు మృతి

Jharkhand: అనుమానాస్పద స్థితిలో జార్ఖండ్‌ కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు వినయ్‌ సింగ్‌ మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

జార్ఖండ్‌లో ఓ విషాదకర సంఘటన వెలుగుచూసింది. కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ సింగ్ (వయస్సు 46) మృతదేహం అనుమానాస్పద పరిస్థితుల్లో కనబడింది. అతని తలకు బుల్లెట్ గాయం ఉండటంతో పాటు, అతని చేతిలో ఓ పిస్టల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వినయ్ సింగ్ కనిపించకుండా పోయినట్లు అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఆయన మొబైల్ ఫోన్‌ లొకేషన్ ఆధారంగా అన్వేషణ చేపట్టారు. లొకేషన్ ఆధారంగా జంషెడ్‌పూర్‌ వద్దకు చేరుకున్న పోలీసులు అక్కడ ఆయన మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించగా, అతని తల భాగంలో బుల్లెట్ గాయం ఉండగా, ఎడమచేతిలో పిస్టల్ కనిపించింది.

వివరాలు 

హత్యా.. ఆత్మహత్య అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు

అంతేకాదు, వినయ్ సింగ్ మరికొంతమంది వ్యక్తులతో కలిసి ఇంటి వైపు తిరిగి వస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. అయినప్పటికీ, ఇది హత్యా? లేక స్వయంగా తానే తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జార్ఖండ్‌ కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు వినయ్‌ సింగ్‌ మృతి