Page Loader
JMM:మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం.. కారు ట్రక్కును ఢీకొట్టడంతో జేఎంఎం ఎంపీ మహువా మజీకి గాయలు 
కారు ట్రక్కును ఢీకొట్టడంతో జేఎంఎం ఎంపీ మహువా మజీకి గాయలు

JMM:మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం.. కారు ట్రక్కును ఢీకొట్టడంతో జేఎంఎం ఎంపీ మహువా మజీకి గాయలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2025
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహాకుంభమేళా (Maha Kumbh) నుండి తిరిగి వస్తుండగా బుధవారం తెల్లవారుజామున జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ ఎంపీ మహువా మాజీ (Mahua Maji) వాహనం ప్రమాదానికి గురైంది. పోలీసుల వివరాల ప్రకారం,ఝార్ఖండ్ ముక్తి మోర్చా(JMM)కు చెందిన ఎంపీ మహువా తన కుమారుడు,కోడలితో కలిసి కుంభమేళాకు వెళ్లి బుధవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా, ఝార్ఖండ్‌లోని లతేహార్ ప్రాంతంలో ఆగి ఉన్న ఓ ట్రక్కును వారి కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఎంపీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు గాయపడ్డారు.వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం,మెరుగైన వైద్యం కోసం రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎంపీ చేతికి అనేక ఫ్రాక్చర్‌లు ఏర్పడ్డాయని,ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎంపీ మహువా మజీకి తీవ్ర గాయాలు