Johnny Master: జనసేనలో చేరిన స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బుధవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
జానీ మాస్టర్‌ను స్వయంగా పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నెల్లూరు నగరానికి చెందిన జానీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొంతకాలం ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ.. ఆయన జనసేనలో చేరారు.
కొన్నిరోజులుగా జానీ మాస్టర్ ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నెల్లూరులో అంగన్వాడీ వర్కర్ల ఆందోళనకు కూడా ఆయన మద్దతుగా మాట్లాడారు.
త్వరలో జరగనున్న ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా జానీ మాస్టర్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ప్రముఖ సినీ నటుడు పృధ్వీ రాజ్ కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జానీ మాస్టర్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న పవన్ కళ్యాణ్
ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శ్రీ షేక్ జానీ మాస్టర్ @AlwaysJani బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. pic.twitter.com/x1ssPyHnjz
— JanaSena Party (@JanaSenaParty) January 24, 2024
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జనసేనలో చేరుతున్న పృధ్వీ రాజ్
ప్రముఖ సినీ నటుడు శ్రీ పృధ్వీ రాజ్ బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. pic.twitter.com/2SC8CxdxFC
— JanaSena Party (@JanaSenaParty) January 24, 2024