Page Loader
JP Nadda: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు చోరీ 
JP Nadda: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు చోరీ

JP Nadda: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు చోరీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2024
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో ఉన్న ఓ సర్వీస్ సెంటర్‌ నుండి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య మల్లికా నడ్డా కారు చోరీకి గురైంది. మల్లికా నడ్డా ఫార్చూనర్ కారును గోవింద్‌పురిలోని సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లగా,అక్కడి నుండి దొంగిలించారని సమాచారం. కారు డ్రైవర్ జోగిందర్ సింగ్ మార్చి 19న ఫిర్యాదు చేయగా,పోలీసులు కేసు నమోదు చేసి కారు కోసం వెతకడం ప్రారంభించారు. మార్చి 19న మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో సర్వీస్ సెంటర్‌లో కారు ఆపి భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లినట్లు డ్రైవర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే తిరిగి వచ్చేసరికి కారు కనిపించకుండా పోయిందని డ్రైవర్‌ వాపోయాడు.పోలీసులు యాక్సెస్ చేసిన సీసీటీవీ ఫుటేజీ ప్రకారం కారు చివరిసారిగా గురుగ్రామ్ వైపు వెళ్తున్నట్లు కనిపించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జేపీ నడ్డా భార్య కారు చోరీ