ArvindKejriwal-kavitha: అరవింద్ కేజ్రీవాల్, కవితకి షాక్.. మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఆగడం లేదు. ఎక్సైజ్ పాలసీలో మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో సీఎం కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. హాజరైన తర్వాత, ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఎక్సైజ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మే 7 వరకు పొడిగించారు. ఈ కేసుకు సంబంధించిన మరో ఇద్దరు నిందితులు బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ ఫండ్ మేనేజర్ చరణ్‌ప్రీత్ సింగ్‌ల జ్యుడీషియల్ కస్టడీని కూడా మే 7 వరకు కోర్టు పొడిగించింది. మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్టు చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని తీహార్‌లో ఉంచారు.