Page Loader
Telangana Formation Day: జూన్ 2న తెలంగాణకు రాష్ట్ర హోదా లభించిన రోజు.. ఆ చరిత్రను ఓసారి గుర్తు చేసుకుందాం!
జూన్ 2న తెలంగాణకు రాష్ట్ర హోదా లభించిన రోజు.. ఆ చరిత్రను ఓసారి గుర్తు చేసుకుందాం!

Telangana Formation Day: జూన్ 2న తెలంగాణకు రాష్ట్ర హోదా లభించిన రోజు.. ఆ చరిత్రను ఓసారి గుర్తు చేసుకుందాం!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకులను ప్రతేడాది జూన్ 2న ఘనంగా జరుపుకుంటారు. 2014 జూన్ 2న అధికారికంగా 28వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. ఇది తెలంగాణ ప్రజల శ్రమ, త్యాగాలకు గుర్తుగా నిలిచిన చారిత్రక మైలురాయిగా చెప్పొచ్చు. చారిత్రాత్మక రోజు జూన్ 2, 2014 తెలంగాణ ప్రజల పోరాటానికి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని (Andhra Pradesh Reorganisation Act) ఆమోదించగా, దాని ఆధారంగా తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది. ఈ రోజు, తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం, స్వతంత్ర గుర్తింపుతో కూడిన ప్రత్యేక రాష్ట్రంగా మారిన ఘట్టాన్ని గుర్తు చేస్తుంది.

Details

తెలంగాణ ఉద్యమం

తెలంగాణ ప్రాంతానికి స్వతంత్ర సాంస్కృతిక వైశిష్ట్యం, ప్రత్యేకతలు ఉన్నా, గతంలో ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉండింది. తమ అభివృద్ధికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న భావనతో స్థానికులు ప్రత్యేక రాష్ట్ర స్థాపనకు కృషి మొదలుపెట్టారు. పలు దశలుగా ఉద్యమం సాగింది. వివిధ వర్గాలు, నాయకుల త్యాగాలతో తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా అవతరించింది.

Details

ఆవిర్భావ దినోత్సవ ప్రాముఖ్యత

ఆ రోజున తెలంగాణ ప్రజలు తాము సాధించిన విజయాన్ని, త్యాగాలను గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు. ప్రత్యేక రాష్ట్ర కోసం పోరాడిన వారికి నివాళులు సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయాలను ఆవిష్కరించుకోవడం అభివృద్ధి పథంలోకి అడుగుపెట్టిన కొత్త ఆరంభానికి గుర్తుగా జరుపుకోవడం రాష్ట్రవ్యాప్తంగా వేడుకల హర్షధ్వానాలు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంతోషం, ఉత్సాహం వెల్లివిరుస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో పర్యటనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభాపూరితులకు సత్కారాలు జరుగుతాయి. ప్రజలు ఊరూరా ఈ పండుగను వేడుకగా మార్చుకుంటారు.