NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ మధ్య కనెక్టివిటీకి కీలక అడుగు 
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ మధ్య కనెక్టివిటీకి కీలక అడుగు 
    తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ మధ్య కనెక్టివిటీకి కీలక అడుగు

    Andhrapradesh: తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ మధ్య కనెక్టివిటీకి కీలక అడుగు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 03, 2024
    03:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. ముఖ్యంగా ఇతర ప్రాంతాలతో అనుసంధానానికి కూడా ప్రాధాన్యం ఉంది.

    ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.

    ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య మేజర్ రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టింది.

    ఇందులో భాగంగా, తెలంగాణలోని వరంగల్ నుంచి ఖమ్మం మీదుగా విజయవాడ వరకు గల భాగంలో జాతీయ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

    ఈ ప్రాజెక్ట్‌ను జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో మేఘా ఇంజినీరింగ్, డీఆర్‌బీ సంస్థలు చేపడుతున్నాయి. మేఘా సంస్థ రెండు ప్యాకేజీలను, డీఆర్‌బీ సంస్థ ఒక ప్యాకేజీని సాధించింది.

    వివరాలు 

    గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే 

    ప్రాజెక్ట్ కోసం భూసేకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి.

    వరంగల్ నుండి ఖమ్మం మీదుగా విజయవాడ వరకు రహదారి నిర్మాణం జరుగుతుండగా, 16వ నంబర్ జాతీయ రహదారితో అనుసంధానం కాబోతోంది.

    ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం నుంచి ఏపీ ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి వరకు, 90 కిలోమీటర్ల మేర ఆరు వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేపడుతున్నారు.

    ఈ ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుండి విజయవాడకు ప్రయాణం సులభతరం అవుతుంది.

    వివరాలు 

    ప్రాజెక్ట్ వివరాలు 

    ఖమ్మం - విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పనుల ఖర్చు రూ. 4,600 కోట్లుగా అంచనా వేశారు.

    మేఘా సంస్థ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఖమ్మం నుంచి బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, ఏపీలోని చెరువు మాధవరం, జి.కొండూరు మీదుగా రాయనపాడుకు చేరుకుంటుంది.

    జక్కంపూడి సమీపంలో విజయవాడ బైపాస్‌కు అనుసంధానం చేస్తారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వడం ద్వారా ఖమ్మం - విజయవాడ మధ్య దూరం సుమారు 30-40 కిలోమీటర్లు తగ్గనుంది.

    ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 26 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం జరుగనుంది.

    జి.కొండూరు మండలంలో పలు గ్రామాల్లో భూసేకరణ పూర్తి కాగా,పంటలు ఉండే భూముల్లో సీజన్ పూర్తయ్యాక నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. మొత్తం 93.8198 హెక్టార్ల భూమిని సేకరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ

    తాజా

    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్
    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్

    ఆంధ్రప్రదేశ్

    AP Cyclone Effect : ఏపీకి ముంచుకొస్తున్న తుపాను ప్రభావం.. ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు  తుపాను
    Polavaram : పోలవరం నిర్మాణంపై కీలక సమీక్షలు.. రేపు సీఎంతో నిర్మాణ సంస్థల భేటీ పోలవరం
    AP High Court: హైకోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యం.. నలుగురు ఐఏఎస్‌లకు వారెంట్లు హైకోర్టు
    AP Free Gas Cylinders 2024 : ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక..ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు- అర్హతలివే! భారతదేశం

    తెలంగాణ

    Dasara Liquor Sales: 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు.. మద్యం అమ్మకాల్లో ఆల్‌టైం రికార్డు ప్రభుత్వం
    Bhatti: తెలంగాణలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవరే లక్ష్యం: భట్టి విక్రమార్క భట్టి విక్రమార్క
    Revanth Reddy: తెలంగాణ సాధనకు 'అలయ్‌ బలయ్‌' స్ఫూర్తి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి
    kaleshwaram judicial commission: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ప్రధాన బ్యారేజీల్లో అవకతవకలు.. 21న రాష్ట్రానికి న్యాయ కమిషన్‌! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025