Jurala Dam: జూరాల డ్యామ్ భద్రతపై ఆందోళనలు!
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు జీవనాధారమైన జూరాల డ్యాం భద్రతపై పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల తుంగభద్ర డ్యాం 19వ గేటు సహా రిజర్వాయర్ గేట్లు కొట్టుకుపోయిన ఘటనలు ఈ భయాందోళనలను పెంచుతున్నాయి. ఇప్పటికే , జూరాల డ్యామ్ భారీ సవాళ్లను ఎదుర్కొంటోంది. దాని గేట్‌లు చాలా వరకు లీక్ అవుతున్నాయి. ఈ సమస్యను నిపుణులు సంవత్సరాలుగా హైలైట్ చేస్తున్నారు. మరమ్మతుల కోసం 2021లో ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా 62 గేట్లకు గాను ఐదు గేట్లను మాత్రమే బిగించినట్లు జూరాల ఈఈ జుబేర్ అహ్మద్ తెలిపారు. ఈ సమస్యలు డ్యామ్ నిర్మాణ సమగ్రత, భారీ వర్షపాతం, నీటి ఒత్తిడిని తట్టుకోగల సామర్థ్యం గురించి విస్తృతమైన సందేహాలకు దారితీశాయి.