LOADING...
KTR: బాధిత కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు.. ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం!
బాధిత కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు.. ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం!

KTR: బాధిత కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు.. ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం జరిగి 200 రోజులు గడిచినా ప్రభుత్వాలు నిశ్చలంగా ఉండటం పట్ల భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇప్పటికీ ఆరుగురి మృతదేహాలు వెలికితీయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం అందించలేదని ఆరోపించారు. 'కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో సమస్యలు తలెత్తినప్పుడు కేంద్రం వెంటనే ఎన్‌డీఎస్‌ఏ బృందాన్ని పంపింది.

Details

బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

అయితే, ఎస్‌ఎల్‌బీసీ ఘటనలో మాత్రం ఎందుకు స్పందించడం లేదు? ఇంత పెద్ద ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు ఒక్క బృందాన్ని కూడా పంపకపోవడం ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. అలాగే, తెలంగాణలో కాంగ్రెస్‌ను రక్షించేది భాజపానే అని ఆయన ఆరోపించారు. 'భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆరు కుటుంబాలకు న్యాయం చేస్తాం. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రాణాలు కోల్పోయిన వారికి కారణమైన వారిని వదిలిపెట్టము. బాధ్యులను కఠినంగా శిక్షించేలా చేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.