Page Loader
Kalwakuntla Kavitha: బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్.. ఏప్రిల్ 8వరకు జైలులోనే కవిత 
బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్.. ఏప్రిల్ 8వరకు జైలులోనే కవిత

Kalwakuntla Kavitha: బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్.. ఏప్రిల్ 8వరకు జైలులోనే కవిత 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2024
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీకోర్టు తన ఉత్తర్వులను ఏప్రిల్ 8కి రిజర్వ్ చేసింది. కవిత మధ్యంతర,సాధారణ బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు.ఆమె రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును ఏప్రిల్ 20న కోర్టు పరిశీలించనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 15న అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ రోజంతా సోదాలు చేసిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ కోర్టు ఆమెను ఏప్రిల్ 9వరకు జైలుకు పంపింది.ఒకేవేళ కవితకి బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంటూ ఈడీ ఆమెకు జ్యుడీషియల్ కస్టడీని కోరింది. ఆమెను విడుదల చేస్తే విచారణకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

Details 

ఫోన్ డేటా మొత్తాన్ని కవిత డిలీట్ చేశారు: ఈడీ 

కవితకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయన్న ఈడీ లిక్కర్ స్కామ్‌ను ప్లాన్ చేసిందే కవిత అని ఆరోపించారు. అదేకాకుండా, ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని.. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదని కోర్టుకి తెలిపారు. తనపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమని కవిత ఆరోపించారు. ఇది అన్యాయమైన, కల్పిత కేసు అని పేర్కొంటూ, ఆరోపణలపై పోరాడతానని ఆమె ప్రతిజ్ఞ చేసింది. ఢిల్లీలో మద్యం లైసెన్సుల కోసం ఆప్ నేతలకు కిక్‌బ్యాక్‌లు ఇచ్చిన గ్రూపులో కవిత ప్రమేయం ఉందని ఈడీ ఆరోపించింది.

Details 

బెయిల్‌పై విడుదలైన సంజయ్ సింగ్

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఆదరణ పొందేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా ఆప్ అగ్రనేతలతో పాటు కవిత ఇతరులతో కలిసి కుట్ర పన్నారని ED ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి ఆప్‌కి చెందిన కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా మొత్తం 16 మందిని అరెస్టు చేశారు. వీరిలో సంజయ్ సింగ్ ఏప్రిల్ 3వ తేదీ బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు.