Page Loader
K.Keshava Rao : సీఎం రేవంత్‌రెడ్డితో బీఆర్‌ఎస్ ఎంపీ కేశవరావు భేటీ 
K.Keshava Rao : సీఎం రేవంత్‌రెడ్డితో బీఆర్‌ఎస్ ఎంపీ కేశవరావు భేటీ

K.Keshava Rao : సీఎం రేవంత్‌రెడ్డితో బీఆర్‌ఎస్ ఎంపీ కేశవరావు భేటీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 29, 2024
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్ఎస్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,సన్నిహితుడు,రాజ్యసభ ఎంపీ కే కేశవరావు టీపీసీసీ అధ్యక్షుడు,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. రేపు ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో అయనతో సమావేశమైన కేశవరావు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నట్లు తెలియజేశారు. కాంగ్రెస్‌లో చేరాలన్న నిర్ణయంపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కేశవరావు కుమార్తె, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా మార్చి 30వ తేదీ శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నారు. 2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఎంపీలు,ఎమ్మెల్యేలు,జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు,కార్పొరేటర్‌లతో సహా పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పార్టీని వీడి,లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లేదా బీజేపీలోచేరుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కె.కేశవరావు