CAG K Sanjay Murthy: భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా సంజయ్‌మూర్తి ప్రమాణస్వీకారం
ఈ వార్తాకథనం ఏంటి
భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి చేపట్టారు.
దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో,ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రమాణస్వీకారం జరిగింది.
సంజయ్‌మూర్తి ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా గౌరవం పొందారు.
అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌ఆర్ మూర్తి కుమారుడు అయిన సంజయ్‌మూర్తి 1964 డిసెంబరులో జన్మించారు.
ఆయన మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 1989లో ఐఏఎస్ అధికారి అవ్వడానికి హిమాచల్ ప్రదేశ్ కేడర్‌ను ఎంపిక చేసుకున్న ఆయన, తరువాత కేంద్ర సర్వీసులలో పనిచేశారు.
వివరాలు
కేంద్ర సర్వీసులలో ఐఏఎస్ అధికారిగా సంజయ్‌మూర్తి తండ్రి
2021 సెప్టెంబరులో జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం అమలులో కీలక పాత్ర పోషించారు.
ఐఏఎస్ అధికారిగా చేరిన అయన, ఉద్యోగ విరమణ సమీపిస్తున్న సమయంలో, కేంద్రం ఈ కీలక పదవిని అప్పగించింది.
CAG పదవి గరిష్ఠంగా ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వరకు కొనసాగే అవకాశం కలిగిస్తుంది.
సంజయ్‌మూర్తి తండ్రి కేఎస్‌ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరఫున అమలాపురం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
ఆయన కూడా కేంద్ర సర్వీసులలో ఐఏఎస్ అధికారిగా కార్యదర్శి స్థాయిలో పనిచేశారు.