
Kakani Govardhan:అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన వైఎస్సార్సీపీ నేత,మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి కోర్టు 14 రోజుల న్యాయ రిమాండ్‌ను విధించింది.
ఆదివారం బెంగళూరులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
సోమవారం ఉదయం, అతడిని నెల్లూరు జిల్లా పోలీసు శిక్షణా కళాశాల నుంచి కోర్టుకు తరలించారు.
ఈ సమయంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం తొమ్మిది పోలీసు వాహనాలతో, ప్రత్యేక పోలీసు బలగాల మధ్య కాకాణిని వెంకటగిరి కోర్టుకు తీసుకొచ్చారు.
అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన పోలీసులు, కోర్టు నుండి ఆయనకు రిమాండ్ ఆదేశాలు పొందారు.
వివరాలు
పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
క్వార్ట్జ్ రాళ్లను అక్రమంగా తవ్వటం, నిషేధిత మార్గాల్లో రవాణా చేయడం, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను వినియోగించడం, అలాగే ఈ కార్యకలాపాలకు అభ్యంతరం తెలిపిన గిరిజనులపై బెదిరింపులకు పాల్పడటం వంటి ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేయబడింది.
ఈ కేసు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో నమోదై ఉండగా, ఇందులో కాకాణి గోవర్ధన్ రెడ్డి నాలుగవ నిందితుడిగా (ఏ4) ఉన్నారు.