
Kamal Haasan: 'ఇండియా' కూటమిలో చేరికపై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరే అంశంపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(MNM) చీఫ్ కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీ ఇండియా కూటమిలో చేరలేదని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్నారు.
దేశ ప్రజల గురించి ఎలాంటి స్వార్థం లేకుండా ఆలోచించే వారికే తమ మద్దతు ఉంటుందని కమల్ హాసన్ పేర్కొన్నారు.
ఎంఎన్‌ఎం ఏడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అలాగే, ఇటీవల తమిళ నటుడు విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించగా.. కమల్ హాసన్ స్వాగతించారు.
అలాగే పొత్తులపై ఎలాంటి అప్టేట్ ఉన్నా.. తాను తెలియజేస్తానని స్పష్టం చేశారు. 2018లో కమల్ హాసన్ ఎంఎన్‌ఎం పార్టీని స్థాపించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మాట్లాడుతున్న కమల్ హాసన్
ஆண்டவரே
— Mathan K5ᴵᴺᴰᴵᴬᴺ² (@MathankamalTUTY) February 21, 2024
சும்மா தெரி #KamalHaasan#MakkalNeedhiMaiam#MakkalNeedhiMaiam_7thyear#ஏழாம்ஆண்டில்_மய்யம் pic.twitter.com/0D5oRS8xwl