Page Loader
ఆమె ఎంతోమంది షర్మిలలను సృష్టించాలి.. అందుకే కారును గిఫ్ట్‌గా ఇస్తున్నానన్న కమల్‌ హాసన్
షర్మిలకు కారును గిఫ్ట్‌గా ఇస్తున్నానన్న కమల్‌ హాసన్

ఆమె ఎంతోమంది షర్మిలలను సృష్టించాలి.. అందుకే కారును గిఫ్ట్‌గా ఇస్తున్నానన్న కమల్‌ హాసన్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 26, 2023
06:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులోని కొయంబత్తూర్‌ లో తొలి మహిళా బస్సు డ్రైవర్‌ షర్మిల అంశం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఈ ఘటన పట్ల తాను చాలా బాధపడ్డానని చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగం కోల్పోయిన మహిళా డ్రైవర్‌కు ఓ కొత్త కారును బహుమతిగా అందజేస్తున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ట్రావెల్స్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్న షర్మిల, ఇక నుంచి పది మందికి ఉపాధి కల్పించే రీతిలో ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. యువతకు ఆమె ఎంతో స్ఫూర్తిగా నిలిచారని కమల్ కొనియాడారు. డ్రైవర్‌ వద్దే ఆగిపోకూడదని, ఎంతో మంది షర్మిలలను సృష్టించాలని కోరుకుంటున్నట్లు వివరించారు.

DETAILS

 పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు ఈ కారును వినియోగించుకోవాలి : కమల్‌ హాసన్‌ 

కమల్‌ కల్చరల్‌ సెంటర్‌ తరఫున అందిస్తున్న ఈ కారును కేవలం క్యాబ్‌ సర్వీసుల వరకే పరిమితం చేయకూడదన్నారు. ఎందరికో ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు ఈ కారును వినియోగించుకోవాలని కమల్‌ హాసన్‌ సూచించారు. డీఎంకే ఎంపీ కనిమొళి ఇటీవలే కోవై పర్యటనలో భాగంగా ఓ మహిళ డ్రైవర్ బస్‌లో ప్రయాణించారు. ఆ సమయంలో బస్సు కండక్టర్‌ సదరు ఎంపీకి టికెట్‌ ఇస్తుండగా సదరు మహిళా డ్రైవర్‌ వద్దంటూ వారించింది. కనిమొళితో కండక్టర్ అనుచితంగా ప్రవర్తించిందని షర్మిల యాజమాన్యానికి కంప్లైంట్ చేశారు. పాపులారిటీ కోసమే తరచుగా సెలబ్రిటీలను ఆహ్వానిస్తోందని, తద్వారా ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారని కండక్టర్‌ సైతం ప్రతి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రావెల్స్‌ యాజమాన్యం డ్రైవర్ షర్మిలను విధుల నుంచి తొలగించింది.