Kamareddy: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌కు ఝలక్.. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపు
కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయం నుంచి దోబూచులాడుతున్న విషయం తెలిసిందే. కామారెడ్డిలో ఎట్టకేలకు ఫలితం వచ్చేసింది. కేసీఆర్‌పై బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి 6వేల మెజార్టీతో గెలుపొందారు. ఇదే స్థానంలో పోటీ చేస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మూడోస్థానంలో ఉన్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎవరు గెలుస్తారు? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ ఓటర్లు మాత్రం కేసీఆర్, రేవంత్ రెడ్డిని కాదని స్థానికుడు వెంకటరమణారెడ్డికి జై కొట్టారు. లెక్కింపు మొదలైనప్పటి నుంచి రేవంత్, కేసీఆర్, వెంకటరమణారెడ్డి మధ్య ఆధిక్యం మారుతూ వచ్చింది. చివరికి వెంకటరమణారెడ్డిని విజయం వరించింది.