LOADING...
Karimnagar: కశ్మీర్‌ను తలపిస్తున్న కరీంనగర్‌.. ఉదయం 9 వరకూ తగ్గని పొగమంచు
కశ్మీర్‌ను తలపిస్తున్న కరీంనగర్‌.. ఉదయం 9 వరకూ తగ్గని పొగమంచు

Karimnagar: కశ్మీర్‌ను తలపిస్తున్న కరీంనగర్‌.. ఉదయం 9 వరకూ తగ్గని పొగమంచు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2026
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

కశ్మీర్‌ దృశ్యాలనే తలపించే ఈ ఫొటోను చూసి చాలామంది అక్కడి దృశ్యమని భావించారు. కానీ ఇది మన కరీంనగరే. గత నాలుగు-ఐదు రోజులుగా కరీంనగర్‌ జిల్లాను దట్టమైన పొగమంచు పూర్తిగా కమ్మేస్తోంది. చిన్నబోయిన సూర్యుడు, కంటికి కనిపించని రోడ్లు, భవనాలు ఉదయం వేళల్లో ప్రత్యేక దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటల వరకు పొగమంచు తీవ్రంగా ఉండటంతో వాహనదారులు లైట్లు వేసుకొని రోడ్లపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఉదయపు వాకింగ్‌కు వెళ్లే వారు పక్కపక్కనే ఉన్నా ఒకరినొకరు గుర్తించలేని స్థాయిలో విజిబిలిటీ తగ్గిపోయింది. దట్టమైన పొగమంచుతో కరీంనగర్‌ జిల్లా మొత్తం శీతాకాల వాతావరణంలో మునిగిపోయింది.

Advertisement