Karnataka: ఉమెన్స్ డే రోజున కర్ణాటకలో దారుణ ఘటన.. ఇజ్రాయెల్ టూరిస్ట్‌పై గ్యాంగ్‌రేప్!
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన మహిళా పర్యాటకురాలు, హోమ్‌స్టే యజమానిపై ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడింది.
ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.
టెక్ హబ్ బెంగళూరు నుంచి 350 కి.మీ దూరంలో ఉన్న కొప్పల్‌లోని తుంగభద్ర ఎడమ ఒడ్డుకు ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు నక్షత్రాలను వీక్షించేందుకు వెళ్లారు.
వీరిలో ఒకరు అమెరికన్, మరొకరు ఇజ్రాయెల్‌కు చెందిన మహిళ. గురువారం రాత్రి 11:30 గంటలకు వారు నక్షత్రాలను ఆస్వాదిస్తుండగా, బైక్‌పై వచ్చిన దుండగులు వారిపై దాడి చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు.
Details
బాధితుల ఫిర్యాదు వివరాలు
29 ఏళ్ల హోమ్‌స్టే యజమాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, తాను తన నలుగురు అతిథులతో కలిసి రాత్రి భోజనం అనంతరం కాలువ ఒడ్డుకు వెళ్లినట్లు తెలిపారు.
అయితే అనుకోని విధంగా దుండగులు అక్కడికి చేరుకొని తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పారు. తన అతిథులను కాలువలో తోసేశారని పేర్కొన్నారు.
ఈ ఘటనలో అమెరికాకు చెందిన డేనియల్, మహారాష్ట్రకు చెందిన పంకజ్ కాలువ నుంచి బయటకు రాగా, ఒడిశాకు చెందిన బిబాష్ జాడ మాత్రం కనిపించలేదని చెప్పారు.
Details
పోలీసుల స్పందన
పోలీసులు ఫిర్యాదు అందుకున్న వెంటనే కేసు నమోదు చేశారు. కొప్పల్ పోలీసు సూపరింటెండెంట్ అరసిద్ది మాట్లాడుతూ, నిందితులు మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ ఘోరం జరిపారని తెలిపారు. బాధిత మహిళల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే వారికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తామని తెలిపారు.
దర్యాప్తు వేగంగా సాగుతోంది
ఈ కేసులో అత్యాచారం, సామూహిక అత్యాచారం, దోపిడీ నేరాల కింద నిందితులపై కేసులు నమోదయ్యాయి.
నిందితులను గుర్తించిన పోలీసులు, రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు.
Details
తప్పిపోయిన పర్యాటకుడి కోసం గాలింపు
ఇక కాలువలో అదృశ్యమైన బిబాష్ కోసం ఫైర్ సిబ్బంది, పోలీసులు గాలిస్తున్నారు.
ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.