కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 10 సంవత్సరాల తర్వాత కర్ణాటకలో సొంతంగా హస్తం పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. 136 సీట్లలో విజయం సాధించి, దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
2018లో గెలుపొందిన 104 సీట్లను గెల్చుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో 65 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
2023 ఎన్నికల్లో కూడా కింగ్ మేకర్ అవ్వాలని ఆశపడిన జేడీ(ఎస్) కేవలం 19 సీట్లను మాత్రమే గెల్చుకుంది. తద్వారా జేడీ(ఎస్) కింగ్ మేకర్ అవ్వాలన్న ఆశ అడియాశలయ్యాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. అయితే
ఎల్లుండి (సోమవారం) కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. కంఠీరవ స్టేడియంలో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అదే రోజు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పుట్టినరోజు కావడం విశేషం. దీంతో డీకేకు కాంగ్రెస్ హైకమాండ్ ఏం గిఫ్ట్ ఇస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో తన బర్త్ డే రోజు సోనియాకు గిఫ్ట్ ప్రకటిస్తానని డీకే అన్నారు. అయితే శివకుమార్ పుట్టినరోజునే కాంగ్రెస్ సర్కార్ కొలువు దీరనుండటం విశేషం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు హాజరవుతారని సమాచారం.
ఈ రోజు కర్ణాటక అసెంబ్లీ కి జరిగిన ఎన్నికలలలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. కర్ణాటక రాష్ట్రంలోని 224 స్థానాల్లో 136 సీట్లను కైవసం చేసుకుని కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు.. భాజపా 65 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ 19, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు.
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కనకపుర సీటులో బీజేపీ నేత, మంత్రి ఆర్ అశోకపై లక్ష ఓట్ల తేడాతో విజయం సాధించారు.
తన గెలుపు తర్వాత, కర్ణాటక సీఎం పదవికి పోటీ పడుతున్న వారిలో ఒకరైన శివకుమార్ తన ధృవీకరణ పత్రాన్ని తీసుకోవడానికి ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్‌పై 13,640 ఓట్ల తేడాతో గెలుపొందారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సూపర్ హిట్ కొట్టింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 36 స్థానాల్లో విజయం సాధించగా, మరో 101 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 17 స్థానాల్లో విజయం సాధించింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్బుత ప్రదర్శన అనంతరం శనివారం విలేకరులతో మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తాము ఎవరినీ విమర్శించడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల కోసమే పని చేస్తామని అన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కును అధిగమించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ కోసం పనిచేసిన వారిని అభినందించారు. కర్ణాటక ఎన్నికల పోరులో కాంగ్రెస్ ప్రేమతో పోరాడిందని, బీజేపీ 'నఫ్రత్ కి బజార్' (ద్వేషపూరిత మార్కెట్)ను మూసివేసిందని రాహుల్ గాంధీ అన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై ఆ పార్టీ చీఫ్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఓటర్లు తమపై ఉంచిన విశ్వాసానికి న్యాయం చేస్తామన్నారు.
కాంగ్రెస్‌కు అనుకూలంగా అఖండమైన తీర్పును ఇచ్చిన కర్ణాటక ప్రజలకు ఖర్గే ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నికల మేనిఫెస్టోలో కన్నడిగులకు చేసిన మొత్తం వాగ్దానాలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం దిశగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అధికార బీజేపీపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేంద్ర బాఘేల్ సెటైర్ వేశారు. మొదట హిమాచల్ ప్రదేశ్‌ని గెలిచామని, ఇప్పుడు కర్ణాటకను గెలుచుకున్నామని, 'కాంగ్రెస్ ముక్త్-భారత్' అని మాట్లాడేవారు, ఇప్పుడు 'బీజేపీ-ముక్త్' దక్షిణ భారతదేశం అనే స్థితికి వచ్చిందన్నారు.
రాష్ట్ర ప్రజల తీర్పును స్వాగతిస్తున్నట్లు జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పే అంతిమమని, ఓటమిని, గెలుపును సమదృష్టితో స్వీకరిస్తానని చెప్పారు. ఈ ఓటమి ఫైనల్ కాదని, తన పోరాటం ఆగదని, ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానని జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి అన్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగెస్ దూసుకుపోతున్న నేపథ్యంలో గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు సిద్ధరామయ్య కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సోపానమని ఆయన అభివర్ణించారు. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయన్న నమ్మకం ఉందన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య స్పందించారు. రాష్ట్ర ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ 130 సీట్లు సాధిస్తుందన్న తన అంచనాకు అనుగుణంగానే కాంగ్రెస్ పనితీరు ఉందన్నారు.
దీంతో ‘ఆపరేషన్ కమలం’ను బీజేపీ పునరావృతం చేసే అవకాశం లేదని సిద్ధరామయ్య అన్నారు.
తమ పార్టీ 130 సీట్లు దాటుతుందని, ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన పెద్ద విజయం అన్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీ ప్రభుత్వంతో విసుగు చెంది ఒక మార్పును కోరుకుంటున్నారని సిద్ధరామయ్య అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధారణ మెజారిటీతో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ శనివారం ఆనందం వ్యక్తం చేశారు. ఇది పార్టీ శ్రేణులు, కార్యకర్తల విజయం అన్నారు.
చల్లకెరెలో కాంగ్రెస్ అభ్యర్థి టి.రఘుమూర్తి 16,450 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ధార్వాడ్‌లో కాంగ్రెస్‌కు చెందిన వినయ్ కులకర్ణి 18,037 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిని ఓడించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని సీఎం బసవరాజ్ బొమ్మై అంగీకరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను విశ్లేషిస్తామని బసవరాజ్ బొమ్మై అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయానికి బీజేపీ మళ్లీ పునరాగమనం చేస్తుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాణిస్తామని బొమ్మై అన్నారు.
అథని నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మహేశ్ కుమతల్లిపై కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ సవాది 30,509 ఓట్లతో గణనీయమైన ఆధిక్యంలో ఉన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ సాధారణ మెజారిటీకి చేరుకోవడంతో, పార్టీ కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుతూ, డప్పుల మోతతో నృత్యాలు చేస్తూ సంబరాల్లో మునిగిపోయారు.
పార్టీ కార్యాలయంలో కర్ణాటక విజయ్ పేరుతో పోస్టర్లను అంటించారు.
ఎగ్జిట్ పోల్ అంచనాలు కర్ణాటకలో నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ నంబర్ 113సీట్లు అవసరం అవుతాయి.
ఈ నేపథ్యంలో మరోసారి కర్ణాటకలో కింగ్ మేకర్ అవుదామని అనుకున్న జేడీఎస్ ఆశలు అడియాసలయ్యాయి.
బీజేపీ 74 స్థానాల్లో ముందంజలో ఉండగా, జేడీ(ఎస్) 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.