Page Loader
Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు 
స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈవారం చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా పాజిటివ్ సిగ్నల్స్ కనిపించినప్పటికీ, భారతదేశం-అమెరికా మధ్య ట్రేడ్ ఒప్పందంపై వస్తున్న వార్తల నేపథ్యంలో మదుపరులు జాగ్రత్తగా వ్యవహరించారు. దీని ప్రభావంతో మార్కెట్లలో రోజు మొత్తం తీవ్రమైన హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. అయినప్పటికీ ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ సుమారుగా 200 పాయింట్ల పెరుగుదల నమోదు చేయగా, నిఫ్టీ 25,450 స్థాయిని అధిగమించింది.

వివరాలు 

నిఫ్టీ @ 25,461

ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 83,306.81 పాయింట్ల వద్ద లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే కొన్ని క్షణాల్లోనే అమ్మకాల ఒత్తిడి రావడంతో సూచీ ఒక్క దశలో 83,015.83 పాయింట్ల వరకు పడిపోయింది. అనంతరం తిరిగి కోలుకొని చివరికి 193.42 పాయింట్ల లాభంతో 83,432.89 పాయింట్ల వద్ద స్థిరపడింది. అదే సమయంలో, నిఫ్టీ కూడా 25,331.65 నుంచి 25,470.25 మధ్య చలనం చూపించింది. చివరికి ఇది 55.70 పాయింట్లు పెరిగి 25,461 వద్ద ముగిసింది. రూపాయి మారక ధర అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 17 పైసలు బలపడి 85.38 వద్ద నిలిచింది.

వివరాలు 

స్వల్పంగా పెరిగిన బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ షేర్లు

రంగాల పరంగా చూస్తే ఆటో మొబైల్‌, టెలికాం, లోహ రంగాలను మినహాయిస్తే మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్‌, ఔషధ ఉత్పత్తులు, చమురు & గ్యాస్, ఐటీ, రియల్ ఎస్టేట్, మీడియా రంగ సూచీలు 0.4% నుంచి 1% మధ్య పెరిగాయి. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యునిలివర్ షేర్లు లాభపడ్డాయి. అయితే ట్రెంట్, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల పాలయ్యాయి. అలాగే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ షేర్లు స్వల్పంగా పెరిగాయి.