
Pakistan: 25 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో ఆఫీస్ ను క్లోజ్ చేసిన మైక్రోసాఫ్ట్.. రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభమే కారణం..
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, రాజకీయ అస్థిరత వంటి అనేక సమస్యల మధ్య పాకిస్థాన్ కష్టాల్లో కూరుకుపోయింది. వ్యవసాయం ఆధారంగా నడుస్తున్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో కొన్ని టెక్నాలజీ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడే అవి కూడా ఒక్కొక్కటిగా తమ కార్యకలాపాలను ముగిస్తూ బయలుదేరుతున్నాయి. ఈ క్రమంలో టెక్నాలజీ రంగంలోని ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ జూలై 3, 2025 నుంచి పాకిస్తాన్‌ను పూర్తిగా విడిచిపోయింది. ఈ, సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా అక్కడి కార్యకలాపాలను మూసివేసింది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ శాఖ చీఫ్ జావాద్ రెహ్మాన్ వెల్లడించారు. ఆయన దీన్ని "ఒక యుగానికి ముగింపు"గా అభివర్ణించారు.
వివరాలు
పాకిస్తాన్ వాణిజ్య లోటు 24.4 బిలియన్ డాలర్లు
మార్చి 7, 2000న మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్‌లోకి ప్రవేశించి అక్కడ డిజిటల్ అభివృద్ధికి నాంది పలికింది. దాదాపు 25 ఏళ్లుగా కొనసాగిన ఈ భాగస్వామ్యాన్ని ఇప్పుడు సంస్థ ముగించింది. మైక్రోసాఫ్ట్ తన నిష్క్రమణకు సంబంధించిన స్పష్టమైన కారణాలను వెల్లడించకపోయినా, ఆర్థిక, రాజకీయ అస్థిరత, వాణిజ్య పరిస్థితుల మైమరపాటే సంస్థకు వెళ్లిపోవడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని పాకిస్తాన్ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వీటి వల్ల మైక్రోసాఫ్ట్‌కు ఆ దేశంలో తన కార్యకలాపాలను కొనసాగించడం కష్టమైంది. 2024 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ వాణిజ్య లోటు 24.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. జూన్ 2025 నాటికి ఆ దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం 11.5బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. ఇది టెక్నాలజీ దిగుమతులు,విదేశీ పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపింది.
వివరాలు
మల్టీనేషనల్ సంస్థలు పని చేయడానికి అనువైన వాతావరణం లేకపోవడం కూడా ఒక్క కారణం
ఇవే కాక, పేదరికంతో బాధపడుతున్న పాకిస్తాన్‌లో స్థానికంగా అవసరమైన నైపుణ్యాలు కలిగిన ప్రజలు కూడా లేరు. అక్కడ టెక్నాలజీ రంగానికి కావలసిన స్థాయిలో ప్రతిభావంతులైన నిపుణులు లేకపోవడం,మార్కెట్ డిమాండ్ కొరత,సామర్థ్యాల లోపం వంటి అంశాలు కంపెనీలను దూరం చేస్తున్నాయి. అంతేకాక, రాజకీయంగా,ఆర్థికంగా మల్టీనేషనల్ సంస్థలు పని చేయడానికి అనువైన వాతావరణం లేకపోవడం కూడా ప్రధానమైన కారణం. ఇదిలా ఉండగా,భారత్ మాత్రం ప్రస్తుతం ప్రపంచంలో టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తోంది.
వివరాలు
టెక్నాలజీ అభివృద్ధికి అవసరమైన మానవ వనరులు తక్కువ
గ్లోబల్ టెక్ కంపెనీలు తమ పెట్టుబడులకు భారత్‌ను అత్యుత్తమ గమ్యంగా గుర్తిస్తున్నాయి. దేశంలో స్థిరమైన పాలన, స్పష్టమైన విధానాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, మైత్రి దౌత్య సంబంధాల వల్ల భారత్ అంతర్జాతీయంగా ప్రాధాన్యత గల దేశంగా ఎదుగుతోంది. ఇక పాకిస్తాన్ విషయంలో చూస్తే, అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు, మదరసాల్లో ఇచ్చే విద్య యువతలో నైపుణ్యాల లోపానికి దారితీస్తున్నాయి. దీంతో అక్కడ టెక్నాలజీ అభివృద్ధికి అవసరమైన మానవ వనరులు తక్కువవుతూ సంస్థలు గుడ్‌బై చెబుతున్నాయి.