
Dalai Lama: టిబెట్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని భారత్‌ను హెచ్చరించిన చైనా
ఈ వార్తాకథనం ఏంటి
టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా దలైలామాకే ఉందని భారత్ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా చైనా స్పందించింది. టిబెట్ అంశాల్లో భారత్ జోక్యం చేసుకోవడం సమంజసం కాదని,ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా ఉండేలా చూసుకోవాలని చైనా పరోక్షంగా హెచ్చరించింది. ఇంతకు ముందు ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు మాట్లాడుతూ... దలైలామా వారసుడి ఎంపికపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఎవరూ లబ్దిచేయలేరని చెప్పారు. ఆ అధికారం పూర్తిగా దలైలామా లేదా ఆయనే నియమించిన సంస్థకు మాత్రమే ఉన్నదని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
వారసత్వం విషయంలో స్పందించిన 14వ దలైలామా లామా టెంజిన్ గ్యాట్సో
ఇందుకు సంబంధించినగా తాజాగా చైనా విదేశాంగ శాఖ స్పందిస్తూ..టిబెట్‌ను ఒక సాధనంగా వాడి భారత ప్రభుత్వం తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని ఆశిస్తున్నామని పేర్కొంది. అలాగే,దలైలామా వారసుడిని అంగీకరించే హక్కు చైనాకు వారసత్వంగా ఉందని కూడా చైనా స్పష్టం చేసింది. ఇక మరోవైపు, తన వారసత్వం విషయంలో ఇటీవల 14వ దలైలామా లామా టెంజిన్ గ్యాట్సో స్పందించారు. తన మరణం తర్వాత తాను తిరిగి పుడతానని తెలిపారు.భవిష్యత్తులో తన పునర్జన్మగా భావించే బాలుణ్ణి గుర్తించే అధికారం గడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కే ఉంటుందని,ఈ ప్రక్రియలో మరెవరూ జోక్యం చేసుకునే హక్కు లేదని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా దలైలామా,చైనాకు పరోక్షంగా బుద్ధి చెప్పారు.అయినప్పటికీ చైనా తన మొండి వైఖరిని కొనసాగిస్తోంది.