
Pakistan: పాకిస్తాన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల ధమకా.. హఫీజ్ సయీద్ సన్నిహిత ఉగ్రవాది హక్కానీ హతం..
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో మరోసారి గుర్తుతెలియని వ్యక్తులు మరోసారి ధమాకా సృష్టించారు. భారతదేశానికి అత్యంత అవాంఛనీయంగా ఉన్న ఉగ్రవాది, లష్కరే తోయిబా సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడైన ముఫ్తీ హబీబుల్లా హక్కానీ దిర్ ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. గురువారం రోజున గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపి అక్కడికక్కడే మృతి చెందేలా చేశారు. ప్రాంతీయ వార్తా వర్గాల ప్రకారం, భద్రతా పరంగా నిరంతరం ఉద్విగ్నంగా ఉండే ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని దిర్ జిల్లాను టార్గెట్ చేసుకున్నారు. ఇక్కడే ముఫ్తీ హబీబుల్లా హక్కానీని తుపాకులతో కాల్చి హతమార్చారు. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారు? దీనికి గల కారణాలేంటి? అనే విషయాలు ఇప్పటికీ పాకిస్తాన్ అధికారులకు అంతుపట్టకుండా ఉన్నాయి.
వివరాలు
లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలపై పెద్ద భయాందోళనలు
ఈ హత్యతో లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలపై పెద్ద భయాందోళనలు నెలకొన్నాయి. హఫీజ్ సయీద్‌కు అత్యంత విశ్వసనీయంగా పనిచేసే వ్యక్తి హత్యకు గురవ్వడమే కాకుండా, ఉగ్రవాద కార్యకలాపాలకు ఇది ఒక పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. పాక్ భూమిపై ప్రధాన కేంద్రాలు నడుపుతున్న ఉగ్రవాద సంస్థలు ఈ ఘటనతో అసహజ ఆందోళనకు లోనవుతున్నాయి. ఇప్పటికే పాక్‌లోని కీలక ఉగ్రవాదులను, భారతదేశంపై కుట్రలు పన్నే వారిని గుర్తు తెలియని వ్యక్తులు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే పదుల సంఖ్యలో ప్రముఖ ఉగ్రవాదులను కాల్చి చంపిన ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజా సంఘటన ఆ పరంపరలో భాగంగా మరో సంచలన ఘటనగా నిలిచింది.